ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు ప్రస్తావన లేకుండా సీఎం ప్రసంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 18: ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి కర్నూలు నగరానికి వచ్చి భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆ హోదాలో మొదటిసారి నంద్యాల ప్రాంతంలో వచ్చిన ఆకస్మిక వరదల సందర్భంగా ప్రజలను పరామర్శించేందుకు ఒక్కసారి జగన్ కర్నూలుకు వచ్చారు. అయితే ఆ సమయంలో ఎలాంటి బహిరంగసభ నిర్వహించలేదు. కేవలం వరదల పరిస్థితిపై నంద్యాలలో అధికారులతో సమీక్ష నిర్వహించి తిరిగి వెళ్లిపోయారు. సుమారు మూడు నెలల అనంతరం మంగళవారం మరోమారు జిల్లా కేంద్రమైన కర్నూలుకు వచ్చారు. వైయస్‌ఆర్ కంటి వెలుగు, నాడు-నేడు పథకాల మలివిడత ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్నూలు వచ్చిన జగన్ సుమారు 20 నిమిషాల పాటు ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విద్య వైద్య సదుపాయాలపై తీసుకుంటున్న చర్యలను మాత్రమే ఆయన ప్రస్తావించారు. ప్రతిపక్షాలపై సైతం కొద్ది సమయం మాత్రమే విమర్శలు గుప్పించారు. అయితే జిల్లా సమస్యలపై ప్రధానంగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రస్తావించిన సమస్యలపై ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జిల్లాలో పడమర ప్రాంతంలోని వేదవతి, దిగువ కాలువ భూగర్భ పైపులైన్, గుండ్రేవుల జలాశయం, ఆర్‌డీఎస్ కుడికాలువ వంటి ప్రధానమైన ప్రాజెక్టులు చేపట్టాలని ప్రజలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దశాబ్దాల కల నెరవేర్చాలన్న ప్రజల కోరిక మేరకు గత ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి వత్తిడితో ఆయా ప్రాజెక్టులకు సంబంధించి పాలనాపరమైన అనుమతులు, నిధుల కేటాయింపు చేరుస్తూ జీఓలు విడుదల చేసింది. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం వైసీపీ గెలవడంతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు.సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినవే కాకుండా ఇతర సమస్యలైన ఓర్వకల్లు పారిశ్రామికవాడ, నంద్యాల, నందికొట్కూరు ప్రాంతాల్లో విత్తనోత్పత్తి కేంద్రాలు, కర్నూలు- అమరావతికి రహదారి విస్తరణ, సాగునీటి సమస్య వంటి ఎన్నో సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. వీటన్నింటినీ ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్‌రెడ్డి ప్రస్తావించి పరిష్కార మార్గాలు చెబుతారని ప్రజలు ఆశించారు. అయితే వారి ఆశలకు భిన్నంగా ఒక్కమాట కూడా మాట్లాడకుండా తాను చెప్పదలుచుకున్నది చెప్పి వేదిక నుంచి వెళ్లిపోయారు. సహజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకులు, ఇతర ఏ రాజకీయ పార్టీ రాష్ట్ర, జాతీయస్థాయి అధ్యక్షులు ఎక్కడికి వెళ్లినా స్థానిక సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారమార్గాల గురించి మాట్లాడుతారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ సైతం ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలుకు విచ్చేసిన సందర్భంలో ఓర్వకల్లు విమానాశ్రయం, సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వాటి అభివృద్ధి పనులను ప్రస్తావించడమే కాకుండా కర్నూలు, రాయలసీమలోని ఇతర జిల్లాల్లోని సమస్యలను పరిష్కరించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని హామీనిచ్చిన సంగతిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రతిసారీ కర్నూలు జిల్లా సమస్యల గురించి మాట్లాడుతూ అనేక హామీలు ఇచ్చేవారని వారంటున్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయించడం, విత్తనోత్పత్తి కేంద్రాలను మంజూరు చేయడం, హంద్రీనీవా నుంచి పత్తికొండ, ఆలూరు, డోన్ నియోజకవర్గాల్లో చెరువులకు నీటిని మళ్లించడానికి అవసరమైన నిధులను మంజూరు చేశారని, అయితే ఆయా పనులన్నీ నిలిచిపోయాయని ప్రజలు అంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆయా పనులను కొనసాగించే విషయాన్ని ప్రస్తావిస్తారని ఆశించిన వారి ఆశ నెరవేరలేదు. మొత్తం మీద ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి బహిరంగ సభలో మాట్లాడిన జగన్మోహన్‌రెడ్డి ప్రజలను ఆకట్టుకొనలేకపోయారన్న విమర్శలను మూటగట్టుకున్నారు.