ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్‌తో మండలి చైర్మన్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 18: రాష్ట్ర శాసనమండలి రద్దుపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మండలి చైర్మన్ షరీఫ్ మంగళవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఏకాంతంగా కల్సి పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులపై సెలక్ట్ కమిటీలను నియమించే అంశంపై చర్చించినట్లు తెలిసింది. సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేయాలంటూ తాను స్వయంగా రెండుసార్లు కార్యదర్శిని ఆదేశించినా మండలి కార్యాలయం సంబంధిత ఫైల్‌ను వెనక్కి పంపించిన విషయమై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై సీఎం జగన్ ఇప్పటికే రెండు మార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను కలవటం, తాజాగా టీడీపీ నేతల బృందం ఢిల్లీకి బయలుదేరటం తెలిసిందే.