ఆంధ్రప్రదేశ్‌

నష్టాల నుంచి డిస్కంలను గట్టెక్కించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: రానున్న ఐదేళ్లలో విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కంలను) నష్టాల నుంచి గట్టెక్కించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు. నాణ్యమైన విద్యుత్ తక్కువ ధరకు విక్రయిస్తామని ముందుకు వచ్చిన వారితో ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ రంగంపై బుధవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేసే సంస్థలతో ఒప్పందాల వల్ల డిస్కంలపై భారం తగ్గుతుందన్నారు. గత ప్రభుత్వంలో కుదుర్చుకున్న అధిక ధరల మాదిరిగా కాకుండా ఆమోదయోగ్యమైన ధరకు ఎవరు విక్రయించినా విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ రకంగా ముందుకు వస్తున్న
సంస్థలను ప్రొత్సహించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయదలచుకున్న 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లపై దృష్టి సారించాలన్నారు. కాలక్రమంలో ఈ ప్లాంట్‌ను విస్తరించేందుకు అనువుగా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ ప్లాంట్ విజయవంతానికి అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. తక్కువ ధరకు విద్యుత్ అమ్ముతామని వచ్చే సౌర, పవన విద్యుత్ సంస్థలను కూడా ప్రోత్సాహించాలన్నారు. దీని వల్ల డిస్కంలకు తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. తద్వారా భారం తగ్గుతుందని వివరించారు. జెన్‌కో థర్మల్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీని వల్ల ప్లాంట్ సామర్థ్యం పెరుగుతుందన్నారు. మూడో పార్టీతో బొగ్గు నాణ్యతను ధ్రువీకరించాలని ఆదేశించారు. నాణ్యమైన బొగ్గు రాకపోతే ప్లాంట్ల సామర్థ్యం తగ్గి, ఆర్థికంగా నష్టపోతామన్నారు. జెన్‌కోను లాభాల బాట పట్టించాలని స్పష్టం చేశారు. హైడ్రో రివర్స్ పంపింగ్ ప్రాజెక్టులపైనా దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రం వెలుపల విద్యుత్ అమ్మకాల కోసం, పెట్టుబడిదారుల కోసం ఎక్స్‌పోర్టు పాలసీని రూపొందించాలన్నారు. విద్యుత్ రంగంలో అవినీతికి చోటు లేకుండా చూడాలన్నారు. కృష్ణపట్నం, వీటీపీఎస్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇంధన రంగం ఉద్యోగులకు క్రమం తప్పకుండా అత్యుత్తమ సంస్థల్లో శిక్షణ ఇప్పించాలని సూచించారు.
*చిత్రం... విద్యుత్ రంగంపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి