ఆంధ్రప్రదేశ్‌

పనులను సకాలంలో పూర్తి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ సహాయంతో ఏపీ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు (ఏపీడీఆర్పీ) కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్ని ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఏపీడీఆర్పీ పనులపై బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో 6 కాంపోనెంట్లలో చేపట్టిన వివిధ పనులు సకాలంలో పూర్తి కావాలన్నారు. ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్న పనులకు టెండర్లను ఆహ్వానించాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 2071 కోట్ల రూపాయలతో వివిధ పనులను చేపడుతున్నాయని, వీటిని 2020 నాటికి పూర్తి చేయాల్సి ఉందని గుర్తు చేశారు. వివిధ శాఖలు దీనిపై దృష్టి సారించి, ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచ బ్యాంక్ తరపున ఏపీడీఆర్పీ ఇన్‌చార్జి దీపక్ సింగ్ మాట్లాడుతూ 2015లో ఈ ప్రాజెక్టు మంజూరైందన్నారు. ప్రస్తుతం చివరి సంవత్సరంలో ఉన్నామన్నారు. ఈ ఏడాదితో ప్రాజెక్టు కాల వ్యవధి ముగియనున్న నేపథ్యంలో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు. ఇప్పటికే రోడ్లు, వంతెన పనులు చాలా వరకూ పూర్తి అయ్యాయని, సముద్ర తీర రక్షణ పనులు కూడా సంతృప్తికరంగా జరుగుతున్నాయన్నారు.