ఆంధ్రప్రదేశ్‌

ఐదు నెలల తరువాత...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) పాలకమండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితుల పేర్లతో దొర్లిన తప్పులను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్లను జారీ చేసింది. 13 మంది పేర్లలో తప్పులు దొర్లగా నియామక ఉత్తర్వులు జారీ చేసిన ఐదు నెలల తరువాత సవరించడం గమనార్హం. టీటీడీ సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా కొంతమంది ప్రముఖులను నియమిస్తూ గత ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జాబితాలో తమ పేర్లలో తప్పులు దొర్లాయని కొంతమంది సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో సవరణలు చేస్తూ బుధవారం నోటిఫికేషన్లను జారీ చేసింది. పాలక మండలి సభ్యులకు సంబంధించి 11 మంది పేర్లను, ప్రత్యేక ఆహ్వానితుల్లో రెండు పేర్లను సవరించింది. పాలకమండలికి సంబంధించి తప్పులు సవరించిన పేర్లలో మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, కొలుసు పార్థసారథి, డాక్టర్ నిశ్చిత ముప్పవరపు, నాదేళ్ల సుబ్బారావు, మూరంశెట్టి రాములు, చిప్పగిరి వెంకట ప్రసాద్ కుమార్, ఎం.ఎస్ శివ శంకరన్, సంపత్ రవి నారాయణన్, ఆర్.కుమారగురు, పుట్టా ప్రతాప్ రెడ్డి, కె.శివకుమార్, ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించి ఆర్. గోవింద హరి, దుష్మంత కుమార్ దాస్ ఉన్నారు. ఈ మేరకు వేర్వేరు నోటిఫికేషన్లను బుధవారం జారీ చేసింది. గత ఏడాది జూలై నుంచి ఇప్పటి వరకూ దాదాపు పేర్లు, తదితర అంశాల్లో దొర్లిన తప్పులను సవరిస్తూ దాదాపు 30 ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
తెలంగాణకు ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి
ఏపీ క్యాడర్‌కు చెందిన తిరుపతి (అర్బన్) ఎస్పీ గజరావు భూపాల్‌ను తెలంగాణాకు డెప్యుటేషన్‌పై వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వ్యక్తిగత కారణాలతో తెలంగాణకు పంపాలన్న వినతిని కేంద్రం ఆమోదించింది. మూడు సంవత్సరాల పాటు అక్కడ పని చేస్తారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
దిశ స్పెషల్ ఆఫీసర్‌కు పదోన్నతి
దిశ స్పెషల్ ఆఫీసర్ ఎం.దీపికకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పదోన్నతి కల్పించింది. ఇకపై ఎస్పీ హోదాలో మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం నుంచి విధులు నిర్వహిస్తారు.
తెలుగులో మరో రెండు చట్టాలు
వివిధ చట్టాలను తెలుగులో ముద్రించే ప్రక్రియలో భాగంగా మరో రెండు చట్టాలను తెలుగులోకి అనువాదం చేసి గెజిట్‌లో ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి చేర్చుకునే) చట్టం, ఆంధ్రప్రదేశ్ వస్తువులు, సేవల (సవరణ) చట్టంను తెలుగులో అందుబాటులోకి తీసుకువచ్చింది.