ఆంధ్రప్రదేశ్‌

విద్యారంగంలో వినూత్న సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: యాజమాన్యాలు సొంతలాభం కొంతమానుకుని తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యాబోధన చేయాలని, విద్యా చట్టాలను, మార్గదర్శకాలను, ప్రభుత్వ నిర్ణయాలను ఉల్లంఘిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. స్థానిక సిద్ధార్థ డిగ్రీ కళాశాల సమావేశమందిరంలో రాష్టస్థ్రాయి ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు, ప్రతినిధులతో బోధన విధానాల అమలు వంటి అంశాలపై విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి రాజశేఖర్, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ వి రామకృష్ణలతో కలిసి మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ విద్యార్థులందరినీ దృష్టిలో ఉంచుకుని విద్యాబోధనల్లో సమానత్వం పాటించాలన్నారు. పేదరికం విద్యకు అడ్డుకాకుడదన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని, అదే ఈ ప్రభుత్వ విధానం అన్నారు. విద్యను వ్యాపారంగానే పరిగణిస్తున్నారని, నాణ్యమైన విద్య కొన్ని వర్గాలకే పరిమితం అవ్వడం గమనించామన్నారు. గత ప్రభుత్వాలు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలపై పర్యవేక్షణ నియంత్రణ లేదన్నది వాస్తవం అన్నారు. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్రంలోని 4 లక్షల 79 వేలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. విద్యాబోధనలో పర్యవేక్షణ, ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నామన్నారు. వీటిని కొందరు దాడిగా చిత్రీకరించడం శోచనీయం అన్నారు. చట్టాలను తమ చేతిలోకి తీసుకోవడం, చిన్న చిన్న కాలేజీల పేర్లతో పెద్ద సంస్థలు కళాశాలలు నడుపుతున్నాయన్నారు. చట్టంలోని వెసులుబాటును తమకు అనుగుణంగా మార్చుకోవడం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ తరహా వ్యక్తులు సమాజ సేవ చేస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం అని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు దిశగా అడుగులు వేస్తున్నదన్నారు. మోడల్ స్కూల్స్‌లో ఇంటర్మీడియట్‌ను కూడా కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని, అదేవిధంగా అంగన్‌వాడీ కేంద్రాలను సమీకృత విధానాలలో పాఠ్యాంశాల బోధనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి విద్యకు ఇచ్చే ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రమాణాలను పాటిస్తూ నాణ్యతతో కూడిన బోధన ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యల వలన కాలేజీల్లో ప్రాక్టికల్స్‌కు కూడా ఈ విద్యా సంవత్సరంలో ప్రాధాన్యత ఇవ్వడమే ప్రభుత్వ తొలి విజయం అని మంత్రి పేర్కొన్నారు. పెద్ద కాలేజీలు బడుగు, బలహీనవర్గాలు, గ్రామీణ వర్గాలు, నిరుపేదల వారికోసం 25శాతం సీట్లు కేటాయించే ఆలోచన చేయాలన్నారు. విద్యను వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతగా స్వీకరించాలని, ప్రభుత్వ నియమనిబంధనలకు అనుగుణంగా విద్యాసంస్థల నిర్వహణ చేయలేకపోతే రాష్ట్రం నుంచి వెళ్ళిపోవచ్చని మంత్రి పేర్కొన్నారు. పాఠ్యాంశాల బోధన ఒక క్రమపద్ధతిలో ఉండాలని, మూసపద్ధతిలో తొలి రెండు నెలల్లోనే ఇంటర్మీడియట్ కోర్స్‌ను పూర్తి చేసి మిగతా బోధనపై దృష్టి పెట్టడం, విద్యార్థులపై ఒత్తిడి పెంచిందన్నారు. అకడమిక్ బోధన, పోటీ పరీక్షల బోధన విడివిడిగా ఉండాలని, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, పాఠశాలలకు అకడమిక్ బోధనకు సంబంధించి అనుమతించినా పోటీ పరీక్షలను కూడా బోధించడం ప్రభుత్వ మార్గదర్శకాల ఉల్లంఘన కింద పరిగణిస్తామన్నారు. ప్రైవేట్ కళాశాలలు మూడు, నాలుగు తరగతులకు సంబంధించిన విద్యార్థులను ఒకే గదిలో ఉంచడం, రేకులషెడ్డుల్లో నిర్వహించడం, సరైన వౌలిక వసతులు కల్పించకపోవడం వంటివి తమ ఉన్నతాధికారుల తనిఖీల్లో బహిర్గతం అయ్యాయన్నారు. ప్రతీ కళాశాల వారి కాలేజీ అనుమతించిన విద్యార్థుల సంఖ్య అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులు, తదితర వివరాలన్నీ ప్రస్పుటంగా ప్రదర్శించాలన్నారు. అదే విధంగా వైట్ బోర్డుమీద బ్లూ అక్షరాలతో విద్యాసంస్థ పేరు ప్రముఖంగా రాయాలని మంత్రి సురేష్ తెలిపారు.

*చిత్రం... రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు