ఆంధ్రప్రదేశ్‌

నిరసనలతో దద్దరిల్లిన అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 19: రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత మహిళలు, రైతులు చేస్తున్న ఉద్యమం బుధవారం నాటికి 64వ రోజుకు చేరుకుంది. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, రాయపూడి, పెనుమాక, ఉద్దండరాయునిపాలెం, నీరుకొండ తదితర ప్రాంతాల్లో మహిళలు, రైతులు పెద్ద ఎత్తున దీక్షలు, మహాధర్నాలను కొనసాగించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని, మూడు రాజధానుల ప్రకటనను ఉప సంహరించుకుంటున్నామని ప్రకటించే వరకు తమ ఉద్యమంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని 29 గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. మూడు రాజధానుల ప్రకటనతో రాష్టవ్య్రాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. రాజధాని అమరావతి సాధనే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. జై అమరావతి, సేవ్ అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చిన్నారులు సైతం వివిధ రూపాల్లో పాల్గొంటూ తమ నిరసనను వ్యక్తంచేశారు. అమరావతిని తరలించి తమ భవిష్యత్తును అంధకారం చేయవద్దంటూ చిన్నారులు విన్నవించారు. కాగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీరుకు నిరసనగా రాజధాని ప్రాంత మహిళలు దీక్షల్లో మేకప్ వేసుకుంటూ వినూత్నతను చాటుకున్నారు. విద్యార్థినులు బ్రష్‌లు చేతబూని తమ గ్రామాల మహిళలకు రంగులు పూస్తూ నిరసనలను వ్యక్తంచేశారు. ఈ సమయంలో రెవెన్యూ అధికారులు తమ పొలాలను సర్వే చేసేందుకు వచ్చారన్న సమాచారాన్ని అందుకున్న మహిళలు మందడం వద్దకు వందలాదిగా తరలివచ్చారు. వెలగపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, మందడం దీక్షల్లో పాల్గొన్న మహిళలు, రైతులు రెవెన్యూ అధికారుల వాహనాలను అడ్డుకుని నిరసన తెలిపారు. రాజధాని భూముల విషయమై కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో సర్వేలు ఎందుకు చేస్తున్నారంటూ నిలదీయడంతో వౌనం పాటించడం రెవెన్యూ అధికారుల వంతైంది. ఇలా ఉండగా అమరావతి రాజధానినే కొనసాగించాలని మహిళలు గుంటూరు నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు.
*చిత్రం...దీక్షల్లో పాల్గొన్న మహిళలు, రైతులు