ఆంధ్రప్రదేశ్‌

శిక్షణా కేంద్రాలకు భూములు కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో సూర్యలంక, భోగాపురం, దొనకొండ తదితర ప్రాంతాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఏర్పాటు చేసే శిక్షణా కేంద్రాలకు భూములను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్నికి ఎయిర్ వైస్ మార్షల్ పతార్గే విజ్ఞప్తి చేశారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆమెను కలిశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ శిక్షణా కేంద్రాలకు అవసరమైన భూముల కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. సూర్యలంక, దొనకొండ, విజయవాడ, భోగాపురం విమానాశ్రయాలను ఆనుకుని ఏర్పాటు చేసే కేంద్రాలకు అవసరమైన భూముల కేటాయింపుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
సీఎస్‌తో తూర్పు
నౌకాదళ చీఫ్ భేటీ
తూర్పు నౌకాదళానికి వివిధ ప్రాంతాల్లో భూములు కేటాయించాలని సీఎస్‌కు తూర్పు నౌకాదళం చీఫ్ ఆఫ్ స్ట్ఫా వైస్ అడ్మిరల్ ఎస్‌ఎన్ ఘోర్మడే విజ్ఞప్తి చేశారు. వెలగపూడి సచివాలయంలో సీఎస్‌ను ఆయన బుధవారం కలిశారు. ఇప్పటికే స్థలాలకు సంబంధించి ప్రతిపాదనలు అందచేశామని తెలిపారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చందన్‌ను సీఎస్ ఆదేశించారు. మిలన్-2020కి హాజరు కావాలని వైస్ అడ్మిరల్ ఆహ్వానించారు.
*చిత్రాలు.. సీఎస్ సాహ్నితో భేటీ అయిన వైమానిక దళ అధికారులు
*సీఎస్‌తో భేటీ అయిన ఈస్ట్రన్ నేవల్ కమాండ్ అధికారులు