ఆంధ్రప్రదేశ్‌

ఆగస్టు నాటికి వెలిగొండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, ఫిబ్రవరి 20: పశ్చిమ ప్రకాశం ప్రజల కరవును శాశ్వతంగా పారదోలేందుకు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సందర్శించారు. తొలుత మొదటి, రెండవ టనె్నల్‌లను పరిశీలించారు. మొదటి టనె్నల్ లోపలికి వెళ్లి పనులు ఏమేరకు జరుగుతున్నాయో పరిశీలించారు. అనంతరం టనె్నల్ వద్ద ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, పనులు చేపట్టిన ఏజెన్సీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి, రెండవ టనె్నళ్ల నిర్మాణ పనులు, ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న గ్రామాల బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తిచేయడానికి మార్చి నాటికి రూ.184 కోట్లు మంజూరు చేస్తానని చెప్పారు. జూలై నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులకు ఆగస్టు నెలలో రూ.1,600 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అత్యంత ప్రాధాన్యత ఈప్రాజెక్టు నిర్మాణం పనులు గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు మొదటి సొరంగం పనులు కేవలం 600 మీటర్లు మాత్రమే తవ్వగలిగారన్నారు. అదే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 1.4 కిలోమీటర్ల మేర టనె్నల్‌ను తవ్వినట్లు తెలిపారు. ఇంకా కేవలం ఒక కిలోమీటర్ మాత్రమే టనె్నల్‌ను తవ్వాల్సి ఉందన్నారు. టనె్నల్‌తోపాటు హెడ్ రెగ్యులేటర్, ఫీడర్ కెనాల్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కృష్టా నదిలో నీరు తగ్గుతుందని ఆ సమయంలో పనులు ముమ్మరం చేయాలని అన్నారు. ప్రాజెక్టు పనుల విషయంలో నిర్లక్ష్యం వహించే గుత్తేదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పనుల వేగవంతానికి, నిధుల దుబారాను అరికట్టేందుకు రివర్స్ టెండరింగ్ విధానం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖామంత్రి
డాక్టర్ సురేష్ మాట్లాడుతూ యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని పుల్లలచెరువు మండలంలో 11,500 ఎకరాల ఆయకట్టును అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పశ్చిమ కాలువ నక్కలవాగు ద్వారా రాళ్లపాడు జలాశయానికి నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు కింద చెరువున్నింటినీ నీటిని నింపే విధంగా అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలన్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ దొనకొండ మండలంలో 9వేల ఎకరాల ఉద్యానవన పంటలను అభివృద్ధి చేయడానికి ప్రాజెక్టు నీటిని సరఫరా చేయాలన్నారు. నాగార్జున సాగర్ కాలువలపై పర్యవేక్షణకు లస్కర్లను నియమించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర అటవీ, శాస్తస్రాంకేతిక, పర్యావరణ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి కె అనిల్‌కుమార్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పినిపె విశ్వరూప్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, కనిగిరి, సంతనూతలపాడు, గిద్దలూరు ఎమ్మెల్యేలు బుర్రా మధుసూదన్‌యాదవ్, టీజేఆర్ సుధాకర్‌బాబు, అన్నా వెంకటరాంబాబు, పీడీసీపీ బ్యాంక్ ఛైర్మన్ ఎం వెంకయ్య, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, సంయుక్త కలెక్టర్ ఎస్ షన్మోహన్, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌దాస్, సహాయ, పునరావాసం శాఖ కమిషనర్ బాబురావునాయుడు, ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీ సి నారాయణరెడ్డి, సీఈ జలంధర్, ఎస్‌ఈ రెడ్డప్ప, ప్రాజెక్ట్స్ ఎస్‌ఈ నగేష్, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ గంగాధర్‌గౌడ్, మార్కాపురం ఈఈ చినబాబు, కంభం ఈఈ ప్రభాకర్, దోర్నాల ఈఈ అబుద్‌అలి, మెయిల్ కంపెనీ ప్రతినిధులు సైదారెడ్డి, శ్రీనాధ్‌రెడ్డి, గాయత్రి కంపెనీ ఈడీ వీవీకే సూర్యనారాయణ, మార్కాపురం ఆర్డీవో శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... ప్రాజెక్టు పనులపై అధికారులు, ప్రాజెక్టు ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి