ఆంధ్రప్రదేశ్‌

పేదలందరికీ ఉచితంగానే ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 20: పేదలందరికీ ప్రభుత్వం ఇళ్లు అందించేందుకు చేపడుతున్న భూసేకరణలో ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులను బలవంతం చేయడం లేదని మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్యాలయంలో గురువారం నాలుగు జిల్లాల మున్సిపల్ కమిషనర్లు, రాష్ట్ర అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూసేకరణ విషయంలో అటు ప్రజలను, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండానే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను చేపడుతున్నామన్నారు. టిడ్కో సంస్థ ద్వారా రాష్ట్రంలో మూడు లక్షల 9వేల ఇళ్లు నిర్మాంచామని, వీటిలో నాలుగు జిల్లాలకు సంబంధించి 70వేలు కేటాయించారని వాటిని అర్హులైన వారికి కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.400కోట్లు లాభం చేకూరిందని, ఆయా నిధులను లబ్ధిదారులకే అందించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో సైతం ప్రతి పేదవారికి సెంట్ భూమిని అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వ భూముల గుర్తింపుతో పాటు, అవసరమైన చోట భూమిని కొనుగోలు చేస్తున్నామన్నారు. ఉగాది నాటికి అర్హులైన వారికి ప్రభుత్వం ఉచితంగానే భూమిని అందించేలా చర్యలు చేపడుతున్నామని, ఈ నేపథ్యంలోనే అధికారులంతా లేఅవుట్ల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. 300 చదరపు అడుగుల ఇళ్లు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా గృహాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. రానున్న వేసవి నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో తాగునీటిని అందించే విధంగా పూర్తిస్థాయిలో ప్రణాళికలు తయారు చేయాలని, వాటికి అనుగుణంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు. ఏడీబీ నిధులు రూ.4,500 కోట్లతో 56 మున్సిపాల్టీల్లో మంచినీటి సరఫరాకు సంబంధించిన పనులు ప్రారంభించామన్నారు. శివారు ప్రాంతాలకూ తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బిల్డింగ్ ప్లాస్ సిస్టమ్(బీపీఎస్)కు రాష్ట్రంలో 41,442 మంది దరఖాస్తు చేసుకున్నారని, వాటిని టౌన్‌ప్లానింగ్ అధికారులు పరిశీలించి ప్లాన్లు మంజూరు చేస్తారని, ఈ నేపథ్యంలో ఎవరైనా ప్లానింగ్ అధికారులు అక్రమాలకు పాల్పడితే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అప్రూవుల్ లేని ప్లాట్లకు ప్లానులు మంజూరు చేస్తే వాటికి రిజిస్ట్రేషన్ సైతం నిలుపుదల చేసే విధంగా ఆన్‌లైన్ ప్రక్రియను అమలు చేస్తున్నామన్నారు. సమావేశంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, డైరెక్టర్ విజయ్‌కుమార్, ఈఎన్‌సీ డాక్టర్ చంద్రయ్య, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రాముడు, జాయింట్ డైరెక్టర్ ఆశాజ్యోతి, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జి.సృజన, ఎడిసి తమీమ్ అన్సారీయా పాల్గొన్నారు.
గత ప్రభుత్వ నిర్ణయాలతోనే నేడు ఇబ్బందులు
గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ఆనాలోచిత నిర్ణయాల కారణంగానే నేడు రాష్ట్ర ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విభజన చట్టంలోని అంశాలను, హక్కులను సైతం రాష్ట్రానికి దక్కకుండా కేవలం కంటి తుడుపు ప్యాకేజీలతో సరిపెట్టుకొవడంతో నేటికి రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయింపులు జరగడం లేదున్నారు. జాతీయ ప్రాజెక్ట్‌గా ఉన్న పోలవరం ప్రాజెక్ట్‌ను సైతం పూర్తిచేయకుండా కాలయాపన చేసిన ఘనత టీడీపీదేనన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విభజన చట్టంలోని అంశాలు, హక్కుల సాధనపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపడుతుందన్నారు. విశాఖలోని పంచగ్రామాల సమస్య పరిష్కారానికి ఓ కమిటీని నియమించామని, త్వరలోనే కమిటీ నివేదిక ఆధారంగా న్యాయం చేస్తామన్నారు. విశాఖ ఆర్థిక రాజధానిగా మారుతున్న నేపథ్యంలో అధికస్థాయిలో నిధులు కేటాయింపుతో పాటు, అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు.
*చిత్రం...విశాఖలో నాలుగు జిల్లాల మున్సిపల్ అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ