ఆంధ్రప్రదేశ్‌

టీడీపీని కాదు.. ఏపీని టార్గెట్ చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఫిబ్రవరి 22: వైసీపీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో ఏం సాధించారో చెప్పే ధైర్యం ఉందా అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడటంతో పాటు పెట్టుబడులను రాష్ట్రం తరిమేయడమే తప్పించి, మీరు చేసింది ఏమైనా ఉందా అంటూ శనివారం ట్విట్టర్‌లో చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి తన మీద, టీడీపీ మీద ఎంత కక్ష ఉందో చెప్పడానికి గత ఐదేళ్ళ పాలన మీద సిట్ వేయడమే నిదర్శనమన్నారు. ఈ ప్రభుత్వానికి ఇదేమీ కొత్త కాదన్నారు. 9 నెలల్లో 3 సిట్‌లు, అయిదారు కమిటీలు వేసి టీడీపీనే కాకుండా, ఏకంగా ఏపీనే టార్గెట్ చేశారన్నారు. అధికారంలోకి వస్తూనే తవ్వండి, తవ్వండి అన్నారని గుర్తు చేశారు. తవ్వితే సన్మానాలు చేస్తాం, అవార్డులు ఇస్తాం, ప్లీజ్ అంటూ అధికారులను బతిమిలాడుకున్నారన్నారు. 8 నెలల క్రితమే మంత్రి వర్గ ఉపసంఘం వేశారన్నారు. తాజాగా ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన జీవో 344 వైసీపీ వేధింపులకు పరాకాష్టగా అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనపై రేపు రాబోయే ప్రభుత్వం సిట్ వేస్తుందన్నారు. కక్ష సాధించుకోవడం తప్ప, వీటి వలన ప్రజలకు ఒరిగేది ఏమిటి అని చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్ హయాంలో తన మీద 26 విచారణలు (14 సభా సంఘాలు, 3 ఉపసంఘాలు, 4 న్యాయ విచారణలు, అధికారులతో 4 విచారణలు, 1 సీబీసీఐడీ ఎంక్వైరీ) జరిపించారంటూ, చివరకు ఏమయిందన్నారు. ఇదీ అంతే అన్న ఆయన రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసి పాలనా యంత్రాంగం నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయడమే వైసీపీ ప్రభుత్వ అంతిమ లక్ష్యమన్నారు. తాజాగా ఏర్పాటు చేసిన సిట్‌నే పోలీస్ స్టేషన్‌గా పరిగణిస్తాం అనడం, తాము చెప్పింది చేయని అధికారులను బెదిరించడం, వేధించడం కోసమేనన్నారు. టీడీపీ నేతలపై కక్ష సాధించడమే వైసీపీ అజెండాగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ ఏనాడూ ఎటువంటి తప్పులు చేయలేదన్న ఆయన వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

*చిత్రం...టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు