ఆంధ్రప్రదేశ్‌

11.87 లక్షల మంది విద్యార్థులకు ‘జగనన్న వసతి దీవెన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 23: నవరత్నాలలో మరో హామీని అమలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రంగం సిద్ధం చేశారు. ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల కోసం ఏడాదికి రూ. 20వేలు చొప్పున ఇవ్వనున్నారు. ఇందులో భాగంగానే జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ఈ నెల 24న విజయనగరంలో సీఎం జగన్ స్వయంగా ప్రారంభించనున్నారు. ఉన్నత చదువులు చదువుతున్న వారికే వసతి దీవెన ఇస్తామని తొలుత ప్రకటించినప్పటికీ ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ పథకం వర్తించే విద్యార్థుల సంఖ్య 11.87 లక్షల మందికి చేరుకోగా వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో తొలి విడతగా 1.140 కోట్లు జమకానున్నాయి. ఏడాదికి రెండుసార్లు విద్యార్థుల తల్లుల ఖాతాకి నగదు జమ అవుతుంది. ఇక విజయనగరంలో ఈ పథకం ప్రారంభించేందుకు సీఎం జగన్ 24న ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11గంటలకు విజయనగరం పోలీసు ట్రైనింగ్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ అయోధ్య మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. 11.25 గంటలకు వైఎస్‌ఆర్ జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం పోలీసు బారెక్ గ్రౌండ్స్‌లో నిర్మితమైన ‘దిశ’ పోలీసు స్టేషన్‌ను ప్రారంభించి హెలికాప్టర్‌లో తాడేపల్లికి మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంటారు. ఇక ఈ పథకం విషయానికొస్తే ఐటీఐ విద్యార్థులకు రూ. 10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15వేలు, డిగ్రీ, ఆపై కోర్సుల విద్యార్థులకు రూ. 20వేలు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇందుకోసం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ యూనిక్ బార్‌కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులు జారీ చేస్తారు. ఆ కార్డులో విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఈ నెల 25 నుంచి గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆ కార్డులను అందిస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం రెండున్నర లక్షల రూపాయలు వరకు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద సాలీనా కనీసం రూ. 2,280 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. జిల్లాలవారీగా చూస్తే ఐటీఐ విద్యార్థుల్లో అత్యధికంగా తూ.గో జిల్లాలో 6,828 మంది, రెండో స్థానంలో విశాఖ జిల్లాలో 6,802, అత్యల్పంగా నెల్లూరులో 2,057 మంది, విజయనగరం జిల్లాలో 2,627 మంది ఉన్నారు. పాలిటెక్నిక్‌లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 14,903 మంది, విశాఖలో 12,198, అత్యల్పంగా శ్రీకాకుళంలో 2,826 మంది, నెల్లూరులో 3,334 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,22,219 మంది, గుంటూరులో 1,08,139, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 51,373, విజయనగరం జిల్లాలో 52,944 మంది విద్యార్థులున్నారు.

*చిత్రం... సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి