ఆంధ్రప్రదేశ్‌

9.2 గంటల్లో వంద కిలోమీటర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనపర్తి, ఫిబ్రవరి 23: తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన రమేష్ లాంగ్‌డిస్టెన్స్ పరుగులో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. వంద కిలోమీటర్ల దూరాన్ని అతను 9.20 గంటల వ్యవధిలో పూర్తిచేసి, అంతకుముందు తెలంగాణ పేరిట ఉన్న 11 గంటల రికార్డును బద్దలుకొట్టాడు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడిలో నివాసం ఉంటున్న ఉందుర్తి రమేష్ స్వగ్రామం రాజానగరం మండలం దివాన్‌చెరువు. ఉన్నత విద్యను మధ్యలో నిలుపుచేశాడు. తల్లిదండ్రులు లేని రమేష్ పరుగునే వ్యాపకంగా పెట్టుకున్నాడు. అనపర్తి జీబీఆర్ కాలేజీలో ట్రాక్ ఉందని తెలుసుకున్న రమేష్ దుప్పలపూడికి మకాం మార్చాడు. జీబీఆర్ కళాశాల పీడీ మహేంద్రను కలసి పరుగుపై ఉన్న ఆసక్తి, కుటుంబ పరిస్థితులను చెప్పడంతో ఆయన కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌ను నియమించారు. మారథాన్ రన్‌లో ఉభయ రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ పేరిట 11 గంటల్లో 100 కిలోమీటర్లు రికార్డు ఉందని తెలుసుకున్న రమేష్ దానిని ఛేదించాలని నిర్ణయించుకున్నాడు. తగిన ప్రాక్టీస్ అనంతరం శనివారం రాత్రి రికార్డు ఛేదనకు నడుం బిగించాడు. శనివారం రాత్రి పది గంటల సమయంలో అనపర్తి జీబీఆర్ కాలేజీ నుంచి మారథాన్ రన్‌ను అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనపర్తి బిక్కవోలు, పందలపాక , మామిడాడ మీదుగా కాకినాడ కోరంగి వరకూ వెళ్లి, తిరిగి అదే మార్గంలో ఆదివారం ఉదయం 7.20 గంటలకు తిరిగి జీబీఆర్ కాలేజీకి చేరుకుని రికార్డు బద్దలుకొట్టాడు. వంద కిలోమీటర్ల దూరాన్ని 9.20 గంటల్లో అధిగమించాడు. రికార్డు సమయంలో తిరిగి వచ్చిన రమేష్‌కు ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, నెక్‌జోన్ మాజీ చైర్మన్ తేతలి ఉపేంద్రరెడ్డి, జీబీఆర్ సంస్థల కరస్పాండెంట్ తేతలి ఆదిరెడ్డి (కొండబాబు) వాకర్స్ క్లబ్ కార్యవర్గం, సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. రమేష్ చేసిన మారధాన్ వీడియోలను లిమ్కా బుక్, ఇండియా బుక్‌లకు పంపిస్తామని తెలిపారు. జాతీయ పరుగు పందెంలో పాల్గొనాలని ఆశిస్తున్న రమేష్ లక్ష్యానికి తమ వంతు సహాయ సహాకారాలు ఉంటాయని వాకర్స్ క్లబ్ ప్రకటించింది.
*చిత్రం... రికార్డు నెలకొల్పిన రమేష్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తదితరులు