ఆంధ్రప్రదేశ్‌

సీఏఏను ఉపసంహరించుకునే వరకూ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 23: దేశ ప్రజల పౌరసత్వాన్ని నిరూపించుకోమనే సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ స్పష్టం చేశారు. పౌరులందరూ తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన దుస్థితిని కల్పిస్తూ బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తెచ్చిందని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌ల ప్రమాదాన్ని గుర్తించిన లౌకికవాదులు, ముస్లింలు, ప్రజాసంఘాలు చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున సాగుతున్నాయన్నారు. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీల్లో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారని, లౌకికవాదిగా చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ ఎంపీలతో సీఏఏ బిల్లుకు మద్దతుగా ఓటు వేయించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎన్‌ఆర్‌పీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 25న ఉదయం 10గంటలకు విజయవాడలోని ఐలాపురం కనె్వన్షన్ హాలులో సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.