ఆంధ్రప్రదేశ్‌

పెట్రోలియం పైపులైన్ నిర్మాణాన్ని అడ్డుకున్న రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, ఫిబ్రవరి 23: వ్యవసాయ పంట పొలాల మధ్య నుండి పెట్రోలియం, మినరల్స్ పైపులైన్ల నిర్మాణం జోరుగా సాగుతుంది. తమ అనుమతి తీసుకోకపోవడంతోపాటు ఎటువంటి పరిహారాలు, సంప్రదింపులు జరపకుండా చేస్తున్న నిర్మాణ పనులను రైతులు ఆదివారం అడ్డుకున్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా, రైతుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా బలవంతంగా సాగిస్తుండడంతో ఆగ్రహించి పైపులైన్ నిర్మాణాన్ని ఇక్కడి ఆవఖండం రైతులు అడ్డగించారు. కేంద్రప్రభుత్వ ఆదేశమంటూ శాటిలైట్ సర్వే పేరుతో వ్యవసాయ భూములను 1962లో ఏర్పాటైన పురాతన చట్టాన్ని అసరాగా తీసుకుని బలవంతంగా పైపులైన్ నిర్మాణం చేపట్టడంపట్ల బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత భూమి ధర రూ.లక్షకు పైగా ఉంటే కేవలం రూ. 20వేలు మొత్తం చెల్లిస్తామని పేర్కొంటూ బలవంతపు పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పగలైతే రైతులు అడ్డగిస్తారనే కారణంతో రాత్రిపూట దొంగచాటుగా పైపులైన్ నిర్మాణ పనులు చేపడుతున్నారని బాధిత రైతులు మళ్ల నూక అప్పారావు, కర్రి నూకరాజు, కర్రి శివప్రకాశరావు, కర్రి గంగాధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.