ఆంధ్రప్రదేశ్‌

ఆమె ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: రాష్ట్రంలో అధికార పార్టీ నేత ఒకరు చేసిన ‘ట్వీట్’ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. సదరు నాయకుడు తన ట్విట్టర్ ఖాతాలో ‘రాష్ట్రానికి త్వరలో మహిళా ముఖ్యమంత్రి రానున్నారు’ అంటూ ట్వీట్ చేసి కొద్ది సేపటికే దాన్ని తొలగించారట. అయితే అప్పటికే కొందరు ఆయన ట్విట్టర్ ఫాలోవర్లు దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఇతర ఖాతాల్లో షేర్ చేయడంతో ఆ విషయం ఇప్పుడు పార్టీలో దావానలంలా వ్యాపించింది. పార్టీలో ఓ మాదిరి నాయకుడి వరకూ ఆ నాయకుడు చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ నాయకుడు పార్టీలో చాలా కాలంగా ఉండడమే కాకుండా పార్టీలో కీలకనేతలతో సత్సంబంధాలు కలిగి ఉండటంతో పార్టీలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు నాయకులు, ప్రధాన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఈ ట్విట్టర్‌లో నాయకుడు చేసిన ట్వీట్‌లో పేర్కొన్న మహిళా ముఖ్యమంత్రి ఎవరు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరిస్థితి ఏంటి అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గత నాలుగైదు రోజులుగా చేస్తున్న ఆరోపణలు సైతం చర్చలో భాగమవుతున్నాయి. అరబ్ దేశానికి చెందిన కంపెనీ త్వరలో సీఎం జగన్‌ను తమకు అప్పగించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. ఆ కంపెనీ తరఫున అరబ్ దేశం జగన్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే గత జనవరిలో కుదిరిన ఒప్పందం ప్రకారం అప్పగించాల్సి వస్తుందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఇంత వరకూ పార్టీ సీనియర్ నాయకులు ఎవరూ ఖండించలేదన్న విషయం సైతం వైసీపీ నేతల మధ్య ప్రస్తావనకు వచ్చింది. అంతేగాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై న్యాయ స్థానాలు విచారిస్తున్న అక్రమ ఆస్తుల కేసులు కూడా త్వరలో విచారణ పూర్తయి తీర్పు వచ్చే అవకాశం ఉందని టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. దీంతో మొత్తం మీద పార్టీలో ఏదో జరుగుతోందని వైసీపీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక పార్టీ నేత ట్విట్టర్‌లో పేర్కొన్నట్లు మహిళా ముఖ్యమంత్రి ఎవరన్న అంశం కూడా చర్చకు వస్తోంది. దీంతో కొందరు వైఎస్ భారతి అంటూ అభిప్రాయపడుతుండగా మరి కొందరు షర్మిల అంటూ వాదిస్తున్నారు. ఇద్దరిలో ఒకరు ఖాయమని చర్చలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాది సంబరాలు చేసుకునే అవకాశం వస్తుందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. న్యాయపరంగా ఏం జరుగుతోందనని తెలుసుకోవడం కోసం పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైసీపీకి చెందిన సదరు నాయకుడు ట్విట్టర్‌లో పేర్కొన్న తాత్కాలిక అభిప్రాయం వైసీపీని కుదిపేస్తుండటంతో పార్టీ వివరణ ఇస్తే బాగుంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.