ఆంధ్రప్రదేశ్‌

శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి పూర్వ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 24: రాజమహేంద్రవరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి వెల్లడించారు. తెలుగు భాషకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో దివంగత ఎన్టీఆర్ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని హైదారాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేశారన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం లక్ష్మీపార్వతి విలేఖర్లతో మాట్లాడారు. యూనివర్సిటీలో ఐదు ప్రాంగణాలు ఉండగా సాహిత్య విభాగానికి రాజమహేంద్రవరం, ప్రాచీన చరిత్ర శాస్త్ర విభాగానికి శ్రీశైలం కేంద్రంగా పీఠాలను ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబునాయుడు తెలుగు యూనివర్సిటీని పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేశారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రతీ విషయంలోనూ తెలుగుదేశం పార్టీ బురదజల్లే కార్యక్రమమే పనిగాపెట్టుకుందని విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు తెలుగు అకాడమీని ఎందుకు రాష్ట్రానికి తీసుకు రాలేకపోయారని ప్రశ్నించారు. తెలుగు భాషకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. మాతృభాషను పరిరక్షించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటూనే తెలుగు భాషను పరిరక్షించడానికి తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేశారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. తెలుగు అకాడమీ ద్వారా తెలుగు భాషకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామన్నారు.
విలేఖర్ల సమావేశంలో పాల్గొన్న రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలోని తెలుగు యూనివర్సిటీకి ఉన్న 45 ఎకరాల్లో 10 ఎకరాలను నేక్ సంస్థకు గతంలో అప్పగించారని, అయితే రాష్ట్ర విభజన తర్వాత 10వ షెడ్యూలులో ఉన్న యూనివర్సిటీకి చెందిన భూమిలో 1.15 ఎకరాల భూమిని గోదావరి గ్యాస్ ప్రైవేటు సంస్థకు అప్పగించారన్నారు. 10వ షెడ్యూలులో ఉన్న ఈ యూనివర్సిటీకి చెందిన భూమిలో 1.15 ఎకరాలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎలా కేటాయించిందని ప్రశ్నించారు. పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే యూనివర్సిటీకి చెందిన 20 ఎకరాల భూమిని సేకరించడానికి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారని, అయితే ఈ అంశం తన దృష్టికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళామని, దీంతో యూనివర్సిటీకి చెందిన భూమిని తీసుకోవద్దని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారన్నారు. విభజన అనంతరం యూనివర్సిటీని అభివృద్ధి గురించి పట్టించుకోని గత తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబునాయుడు, తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు నేడు యూనివర్సిటీని ఎత్తివేస్తున్నారని దుష్ప్రచారం చేయడం ఎంత మాత్రం తగదన్నారు. ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించి వీసీని నియమించారని, యూనివర్సిటీలోని 26 విభాగాలకు సంబంధించిన కార్యకలాపాలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. యూనివర్సిటీ యథావిథిగా పనిచేస్తుందని, ఎటువంటి అపోహలకు గురికావాల్సిన అవసరంలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ మాటలతో కాలయాపనచేస్తే, తమ ప్రభుత్వం చేతలతో పాలన సాగిస్తుందన్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన భూములను ఇళ్ల స్థలాలకు సేకరిస్తున్నట్టు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేశారా అనే ప్రశ్నకు ఆయన సమాధానాన్ని దాటవేశారు. ఇళ్ల స్థలాలకు జేసీబీతో చదును చేస్తున్నారనే అంశాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా కలెక్టర్‌తో మాట్లాడతానన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, డాక్టర్ ఆకుల సత్యనారాయణ, వైకాపా నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, నాయకులు అజ్జరపు వాసు, కానుబోయిన సాగర్, పోలు విజయలక్ష్మి, మార్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... రాజమహేంద్రవరంలో సోమవారం విలేఖరులతో మాట్లాడుతున్న లక్ష్మీపార్వతి