ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు నీచమైన చేష్టలకు బరి తెగిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 25: ప్రతిపక్ష నేత చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు బరితెగిస్తున్నారంటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాజధాని తరలించవద్దన్న పిలుపుతో ఏదేదో అయిపోతుందనుకున్నారు.. అయితే దీని గురించి ఎవరూ పట్టించుకోవటం లేదని మంగళవారం ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దీంతో డీలా పడి కారం చల్లే పెప్పర్ గ్యాంగ్‌ను వీధుల్లోకి వదులు తున్నారన్నారు. ప్రస్తుతం ఆందోళన చేస్తున్న వారంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులేనని ధ్వజమెత్తారు. బాబు పదవిలో ఉన్నంత కాలం ఆయన ఏ సంతకం చేసినా, జీవో ఇచ్చినా, పర్యటన చేసినా మొత్తం కమీషన్లు, వాటాల కోసమేనని అన్నారు. ఈ క్రమంలో ఎల్లో మీడియా డప్పులు కొడుతూ బొక్కలు బయట పడకుండా చూసేదన్నారు. నాటి దోపిడీ వ్యవహారాలు నేడు సాక్ష్యాధారాలతో ఒక్కొక్కటి బయడపడుతుంటే కులం, కక్ష అంటూ బాబు బట్టలు చించుకుంటున్నాడన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటే అమరావతిలో ఎలాంటి సంబంధంలేని మహిళలతో దాడులు చేయించడమా అని ప్రశ్నించారు.