ఆంధ్రప్రదేశ్‌

కార్పొరేట్ ఆసుపత్రులపై ఐటీ మెరుపు దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 25: విజయవాడలో పలు కార్పొరేట్ ఆసుపత్రులపై మంగళవారం ఐటీ అధికారులు మెరుపుదాడులు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పుడు లెక్కలు చూపుతున్నారంటూ ఆయా సంస్థలపై కొరడా ఎక్కుపెట్టారు. దీంతో ఒక్క విజయవాడలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులు, వైద్యులు ఉలిక్కిపడ్డారు. ఓ వైపు ఆదాయం కోట్లలో ఉన్నప్పటికీ ఆదాయపన్ను శాఖకు పన్ను చెల్లించకుండా ఎగవేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులపై ఐటీ అధికారులు నిఘా పెట్టారు. విజయవాడలోని ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఐటీ అధికారులు అర్ధరాత్రి వరకు దాడులు సాగిస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన అన్ని ఫైల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపు విషయంలో అవకతవలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే విషయంలో కోట్ల రూపాయాల్లో ఆదాయం ఉన్నప్పటికీ పన్ను చెల్లించే సమయానికి తక్కువగా చూపుతున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఆ ఒక్క ఆసుపత్రిలోనే పది మందికి పైగా ఐటీ అధికారులు రోగులకు ఇబ్బంది కలగకుండా ఆసుపత్రిలో తనిఖీలు కొనసాగిస్తున్నారు.