ఆంధ్రప్రదేశ్‌

సముద్రంలో నీటి బిందువే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 25: రాజధాని అమరావతి కోసం చేసే ఖర్చు సముద్రంలో నీటి బిందువు మాదిరి అవుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో ప్రపంచ బ్యాంక్ ప్రతిధులతో మంగళవారం భేటీ సందర్భంగా రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణపై చర్చ జరిగింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం, అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం కోసం అసెంబ్లీలో ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని బృందానికి ముఖ్యమంత్రి వివరించారు. అమరావతి ప్రాంతం అటు విజయవాడకు, ఇటు గుంటూరుకు సంబంధం లేకుండా రెండు నగరాలకు దూరంగా ఉంచారన్నారు. ఇక్కడ డ్రైనేజీ, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కల్పించడానికి ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వివరించారు. వౌలిక సదుపాయాల కోసం రూ. 1.09 లక్షల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని గత ప్రభుత్వమే అంచనా వేసిందని వివరించారు. గడచిన ఐదేళ్ల కాలంలో రూ.5674 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని, మరో 3 వేల కోట్ల రూపాయల బిల్లులను బకాయిలుగా పెట్టారన్నారు. ఏటా 6 నుంచి 7 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, ఎప్పటికి రాజధాని పూర్తి అవుతుందని వ్యాఖ్యానించారు. ఖర్చు చేయాల్సిన 1.09 లక్షల కోట్లలో ఈ మొత్తం సముద్రంలో నీటి బిందువు మాదిరి అవుతుందని విమర్శించారు. రాష్ట్రంలో విశాఖ నెంబర్ వన్ నగరమని, ఇప్పటికే అన్ని రకాల వౌలిక సదుపాయాలు ఉన్నాయని గుర్తు చేశారు. అక్కడ పెట్టే ప్రతి రూపాయి కూడా ఆ నగర స్థాయిని మరింతగా పెంచుతుందన్నారు. దీని వల్ల పెట్టుబడులు పెట్టేవారు ఆసక్తి చూపిస్తారన్నారు.