ఆంధ్రప్రదేశ్‌

అంగన్‌వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 25: రాష్టవ్య్రాప్తంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలను పారదర్శకంగా అందించేందుకు సీసీ కెమేరాలతో పర్యవేక్షిస్తామని మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా,శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, ప్రాజెక్ట్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలువురు ఉద్యోగుల నుంచి గ్రీవెన్స్‌ను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని పూర్తిస్థాయిలో అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత మహిళా,శిశు సంక్షేమాధికారులపైనే ఉందన్నారు.ప్రతి అంగన్‌వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు,లోపాలుపై దృష్టి సారించామని, తాజాగా మహిళా,శిశు సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.129కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు, గర్భిణులకు, దివ్యాంగ పిల్లలకు సైతం సకాలంలో నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ప్రాజెక్ట్ డైరెక్టర్లను ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తే శాఖా పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మూడు జిల్లాలకు చెందిన పలువురు ఉద్యోగులు, సిబ్బంది తమ పదోన్నతులు, ఏజెన్సీ ప్రాంతాల్లో విధుల సమస్యలను మంత్రి లిఖితపూర్వకంగా తీసుకెళ్లారు. ఉద్యోగినుల సమస్యపై మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని రీజనల్ డైరెక్టర్‌ను ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృత్తికా శుక్లా, మూడు జిల్లాల ప్రాజెక్ట్ అధికారులు పాల్గొన్నారు.