ఆంధ్రప్రదేశ్‌

అవినీతిని దాచిపెట్టేందుకే యాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 25: చంద్రబాబునాయుడు, ఆయన కోటరి రూ.40 వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిందని, ఆ అవినీతి బాగోతం బయటపడుతుందనే దాన్నుంచి ప్రజలను పక్కదోవపట్టించేందుకు ప్రజా చైతన్యయాత్రలు ప్రారంభించారని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా ఆరోపించారు. కడప నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అప్పట్లో 29 గ్రామాల రైతుల నుండి బలవంతంగా, పోలీసులతో భయపెట్టి భూములను లాక్కున్నారని ఆరోపించారు. ఏడాదికి మూడుపంటలు పండే భూములను రాజధాని పేరుతో బలవంతంగా లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కమిటీలు ఇచ్చిన నివేదికలు పట్టించుకోకుండా అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు, లోకేష్, వారి బినామీలు వేల ఎకరాల భూములను కొనుగోలు చేశారన్నారు. 4 వేల ఎకరాలకు పైగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. అమరావతి కమ్మ కులానికే రాజధాని అవుతుందని దళిత మేధావి కత్తి పద్మారావు ఆరోజే అన్నారని ఉప ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు తన అవినీతి బాగోతం బయటపడుతుందనే భయంతోనే అమరావతి రాజధాని కావాలంటూ అక్కడి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం రూ.1.10 లక్షల కోట్లు అవసరమవుతాయని చెప్పిన చంద్రబాబు ఐదేళ్లలో రూ. 6 వేల కోట్లు మాత్రమే ఖర్చుచేశారన్నారు. ఆ రకంగా రాజధాని పూర్తయ్యేందుకు ఎన్ని దశాబ్దాలు పడుతుందని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని వికేంద్రీకరించి వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం, రాయలసీమకు న్యాయం చేసేందుకే రాజధానిని విభజించిందన్నారు. ఖర్చులేని రాజధానిని ఏర్పాటు చేసుకుంటుంటే చంద్రబాబునాయుడు అమరావతి పేరుతో కొంతమంది రైతులను ఉసిగొల్పి ఆందోళనలు చేస్తున్నారన్నారు. శాసనసభ ఉన్నచోటే హైకోర్టు ఉండాలని ఎక్కడా చెప్పలేదన్నారు. గతంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని పెడితే ఆయనకు ఎందుకు మంట అని ప్రశ్నించారు. 40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే వ్యక్తి, ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి, అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఎనిమిదినెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకుపోతోందన్నారు. 1.30 లక్షల మందికి గ్రామ వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దేనని అంజాద్‌బాషా అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే దిశ చట్టం, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వంటి స్ఫూర్తిదాయకమైన చట్టాలను తీసుకువస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంతో మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం, అభివృద్ధి జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు.

*చిత్రం... ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా