ఆంధ్రప్రదేశ్‌

ఎర్రచందనం స్మగ్లింగ్‌కు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నియంత్రణకు అటవీ, పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి రెడ్‌శాండల్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చందనం సాగు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అటవీశాఖలో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేయాలని సూచించారు. స్మగ్లింగ్ నివారణకు అటవీశాఖకు ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ వింగ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించి తగిన ప్రతిపాదనలతో రావాలని అధికారులను ఆదేశించారు.
తిరుపతి కేంద్రంగా ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ఫోర్స్ టీంనకు ఇన్‌స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారిని నియమించేందుకు తగిన ప్రతిపాదనలు పంపాలన్నారు. స్మగ్లింగ్ నియంత్రణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అధికారులు, సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 74 ప్రకారం తగిన నష్టపరిహారాన్ని సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత పటిష్టం చేసి మెరుగైన రీతిలో సమాచార సేకరణకు తోడ్పాటు నందించేలా విస్తృత పరచాలన్నారు. అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ 2000 సంవత్సరం నుండి అప్పటి వరకు స్మగ్లింగ్‌కు సంబంధించి 15వేల 940 కేసులు నమోదు కాగా 14వేల 546 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అదేవిధంగా 9 వేల 694 వివిధ వాహనాలను స్వాధీనం చేసుకుని 29వేల 235 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. స్మగ్లర్ల నుండి స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనంలో 2005 నుండి 2018 వరకు రూ. 8వేల 179 మెట్రిక్ టన్నులు విక్రయించగా 6వేల 822 మెట్రిక్ టన్నులు ఎగుమతి చేయటం ద్వారా సుమారు రూ. 17వందల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందని తెలిపారు. అంతకు ముందు అటవీశాఖ విజిలెన్స్ విభాగం అదనపు పీసీసీఎఫ్ ఏకె ఝా పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తూ గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదికను వివరించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు వివరిస్తూ రాష్ట్రంలో 913 బేస్ క్యాంప్‌లు పనిచేస్తున్నాయని వాటిలో 85 ప్రత్యేకంగా ఎర్రచందనం సాగయ్యే ప్రాంతాల్లోనే ఉన్నాయన్నారు. మొత్తం 52 స్ట్రైకింగ్ ఫోర్స్‌లకు గాను 32 ప్రాంతాల్లో పనిచేస్తున్నాయని, 113 చెక్‌పోస్టులలో 50 కొనసాగుతున్నాయని తెలిపారు. సిబ్బందికి 42 హై రిజల్యూషన్ కెమేరాలు అందించామని ఇప్పటివరకు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి 42 మందిని పీడి యాక్ట్ కింద అరెస్టు చేశామని వివరించారు. సమావేశంలో శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, పీసీసీఎఫ్ బీవీ రమణమూర్తి, పోలీస్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

*చిత్రం... మంగళవారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి రెడ్‌శాండల్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో అధికారులతో సమీక్షిస్తున్న సీఎస్ నీలం సాహ్ని