ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ పాలన రాష్ట్ర ప్రజలకు శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామకుప్పం, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో అధికార పార్టీ చేస్తున్న ఆరాచకాలను తిప్పికొట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే ప్రజాచైతన్య యాత్రలకు శ్రీరాం చుట్టామని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండవరోజు పర్యటనలో భాగంగా మంగళవారం రామకుప్పం మండలం గోవిందపల్లిలో ప్రజా చైతన్యయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ పాలన రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని, గతంలో పేదల సంక్షమం కోసం ప్రవేశ పెట్టిన అనేక పథకాలను రద్దుచేసి పేదల జీవితాలతో చెలగాటం అడుతోందని ఆరోపించారు. పలు కారణాలతో పింఛన్లు, రేషన్ కార్డులు, రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి కానుకలు, చంద్రన్న బీమా, నిరుద్యోగ భృతి, విదేశీ విద్య తదితర పథకాలను రద్దు చేసారన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఏడు లక్షల పింఛన్లు, 18లక్షల రేషన్‌కార్డులు రద్దుచేశారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో 90శాతం గృహనిర్మాణాలను పూర్తిచేసినా ప్రస్తుతం కేవలం పదిశాతం పనులు చేసి వాటికి పార్టీ రంగులు వేశారన్నారు.
కుప్పం పట్టణానికి హంద్రీ-నీవా ద్వారా నీటిని తీసుకు రావడానికి దాదాపుగా పనులు పూర్తిచేస్తే, అధికారంలోకి వచ్చిన వైసీపీ తనపై కోపంతో నీటి విషయంలో కూడా రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఈ పనులకు కేవలం 20 కోట్లు వ్యయం చేస్తే కాల్వలు ద్వారా నీటిని మళ్లించవచ్చని తెలిపారు. తొలిసారి పులివెందలకు నీరు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి లాంటిదని, రివర్స్ టెండరింగ్ పేరుతో పనులు నిలిపి వేసి నిధులు స్వాహా చేస్తున్నారన్నారు. రాష్ట్రం విడిపోయనప్పటికి 16వేల కోట్లు లోటు బడ్జెట్‌లో ఉన్నా మంచి పరిపాలన అందించామన్నారు. అమరావతి నిర్మాణానికి స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి భూములు ఇవ్వడంతో పలు నిర్మాణాలు జరిగాయని, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం రాష్ట్రానికి మూడు రాజధానుల పేరిట రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసినట్లేనని చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, హత్యా రాజకీయాలను ప్రోత్సహించ వద్దని హితవుపలికారు. గతంలో తనపై 26 కేసులు పెట్టినా ఏ కేసు నిలవలేదని, తనపై ఏ కేసుల బనాయించినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎన్టీఆర్ సుజల ప్రాజెక్టు ద్వారా రెండు రూపాయలకే 20లీటర్ల నీరు అందిస్తుంటే, వైసీపీ పాలనతో దాన్ని నాశనం చేశారన్నారు. కుల రాజకీయాలతో రాప్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టిస్తున్నట్లు ఆరోపించారు. నేడు రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందన్నారు. ఇసుకతో వైసీపీ నేతలు భారీగా దోచుకొంటున్నారని, ప్రభుత్వ విధానాలతో పెట్టబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. దీనివల్ల చాలామంది నిరుద్యోగులకు ఉపాధి లభించటం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఇతర నేతలు పాల్గొన్నారు.
*చిత్రం... కుప్పం మండలం కంగుంది గ్రామంలో ప్రసంగిస్తున్న చంద్రబాబునాయుడు