ఆంధ్రప్రదేశ్‌

బాబు పర్యటనకు అడ్డంకులపై వామపక్షాల ఖండన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 27: ప్రతిపక్ష నేత చంద్రబాబు విశాఖ పర్యటనను ఉద్దేశపూర్వకంగా అడుగడుగునా ఓ వైపు వైకాపా కార్యకర్తలు మరో వైపు పోలీసు యంత్రాంగం అడ్డుకోవడం దారుణమంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరకు వెళ్లి వారి విధానాన్ని తెలియజేసే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుందన్నారు. అలాగే ప్రభుత్వ విధానాలపై తమ నిరసన సైతం తెలియజేయవచ్చన్నారు. కానీ గురువారం ప్రతిపక్ష నేత పర్యటనను అడ్డుకుని వారిపై చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలు విసరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.