ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగాల పేరిట మోసగించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 27: కొంత మంది దళారులు, మోసగాళ్లు రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులు, అభ్యర్థులను మోసగిస్తున్నట్లు ఇటీవల రైల్వే అధికారుల దృష్టికి వచ్చిందని, వారిని నమ్మి మోసపోవద్దని దక్షిణ మధ్య రైల్వే శాఖ గురువారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సమయానుసారంగా క్రమపద్ధతిలో నియామకాలు చేపడతారన్నారు. ఈ నియామకాలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, జోనల్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ల ద్వారా ఒక నిర్దిష్ట విధానంలో చేపడుతూ ఉంటుందన్నారు. ఈ నియామకాల కోసం ముందుగా అన్ని ప్రముఖ పత్రికలతోపాటు ఎంప్లారుూమెంట్ న్యూస్ పత్రికలో కూడా ప్రకటనలు ఇస్తారన్నారు. ఇందుకోసం అధికారుల పటిష్ట పర్యవేక్షణలో రాత పరీక్షలను నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు వ్యక్తిగతంగా కాల్ లెటర్లు పంపించి ఉద్యోగ ప్రత్యేకతనుబట్టి ఒక నిర్ధిష్టమైన తేదీని నిర్ణయించి ఇంటర్వ్యూ కోసం, యోగ్యతా పత్రాల పరిశీలనకు, వైద్య పరీక్షలకు పిలుస్తారన్నారు. ఈ ప్రక్రియలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, జోనల్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ సంస్థల్లో దళారులు, మధ్యవర్తులు, ఏజెంట్లు జోక్యం చేసుకుని ప్రభావితం చేయడానికి ఎటువంటి అవకాశం ఉండదని ఆ ప్రకటనలో తెలిపారు.