ఆంధ్రప్రదేశ్‌

అడ్డగింపులు, అరెస్ట్‌లతో బాబును, టీడీపీని ఆపలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 27: అడ్డగింపులు, అరెస్ట్‌లతో చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య, శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్‌బాబు స్పష్టంచేశారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తరిమికొట్టిన అరాచక, దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. విశాఖలో చంద్రబాబు పర్యటనను ఎందుకు అడ్డుకున్నారో, ఎవరి ఆనందం కోసం, ఎవరికి ఇచ్చిన మాట కోసం ఆ పనిచేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు ప్రజా చైతన్యయాత్రకు స్థానిక నేతలు ముందుగానే పోలీసుల అనుమతి తీసుకున్నారన్నారు. యాత్రకు అనుమతి ఇచ్చిన పోలీసులు వైసీపీ కార్యకర్తలను విమానాశ్రయంలోకి ఎలా అనుమతిచ్చారని, మాజీ ముఖ్యమంత్రిపై దాడి చేసేందుకు వస్తున్న వారిని కట్టడి చేయడంలో ఎందుకు విఫలమయ్యారని నిలదీశారు. గతంలో విశాఖ విమానాశ్రమయంలో జగన్‌ను పోలీసులు అడ్డుకుంటే అందుకు ప్రతీకారంగా చంద్రబాబును నేడు నిర్బంధించారన్నారు. ఆనాడు విశాఖలో పారిశ్రామిక వేత్తల సదస్సు జరుగుతున్న దృష్ట్యా జగన్ తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీని నిలుపుదల చేసి ఆయన్ను అడ్డుకున్నారని, ఆనాడు పోలీసులు తమ విధులను నిర్వర్తించారే తప్ప టీడీపీ నేతలు, కార్యకర్తలు జగన్‌ను అడ్డుకోలేదన్నారు.
చంద్రబాబు పర్యటనతో వణుకెందుకు : బచ్చుల
విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి పిలుపునివ్వడం హేయమని టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఖండించారు. హుదూద్ తుపానుతో విశాఖ అల్లాడితే విజయమ్మను ఓడించినందుకే ప్రకృతి ప్రకోపించందంటూ, విశాఖ వాసుల కష్టాన్ని, బాధను హేళన చేసి నేడు విశాఖపై ప్రేమ చూపినట్లు నటించడం సిగ్గుచేటన్నారు. విజయవాడ టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ భూ దాహానికి వైజాగ్ ప్రజలు విలవిల్లాడుతున్నారని, చంద్రబాబు పర్యటనంటే జగన్ వెన్నులో వణుకెందుకని ప్రశ్నించారు. రాజధాని మార్పు పేరుతో ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి భూ కుంభకోణాలకు జగన్ తెగబడుతున్నారని అన్నారు.