ఆంధ్రప్రదేశ్‌

ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టకండి: బొత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 27: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విజయనగరం, విశాఖ జిల్లాల్లో శుభకార్యాలకు హాజరయ్యేందుకు వెళుతూ ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో ప్రజలను రొచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం తగదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హితవుపలికారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు రోజులుగా చంద్రబాబు ఆ ప్రాంత వాసుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖను, వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించగా, ఆ ప్రాంత అభివృద్ధి ఇష్టంలేని చంద్రబాబు మోకాలడ్డుతున్నారన్నారు. అక్కడి ప్రజలను ఉన్మాదులు, పెయిడ్ ఆర్టిస్ట్‌లంటూ కించపరిచారన్నారు. బాబు తన గూండాలు, రౌడీలను వెంటబెట్టుకుని శాంతిభద్రతలకు విఘాతం కల్గించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్రంలో ఆంధ్రుల హక్కుల కోసం పోరాడిన ప్రాంతం ఉత్తరాంధ్రని, ఉద్యమాలకు పుట్టినిల్లు ఈ ప్రాంతమన్న విషయం బాబు మరచినట్లున్నారన్నారు. ఉత్తరాంధ్రే కాకుండా రాయలసీమ వెళ్లినా చంద్రబాబును ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. బాబుకు తన సామాజికవర్గం తప్ప ప్రజలు అక్కర్లేదని బొత్స ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా చంద్రబాబు మాట్లాడతారన్నారు. సమ్మిట్‌లు మాత్రం విశాఖలో పెట్టిన చంద్రబాబు పాలనా రాజధాని మాత్రం అక్కర్లేదనడం ఆయన ద్వంద్వ విధానానికి నిదర్శనం కాదా అని బొత్స ప్రశ్నించారు. విశాఖలో గురువారం జరిగిన సంఘటన చూస్తే బాబు తన వైఖరి మార్చుకునేంత వరకు ప్రజలు ఆందోళన చేస్తారని అర్థమవుతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ప్రజల్లో ప్రాంతీయ విభేదాలు తీసుకువస్తారా అంటూ మండిపడ్డారు. అమరావతిని పరిరక్షించుకుంటానంటూ బాబు వ్యాఖ్యలు చేస్తున్నారని, అయితే ప్రభుత్వమే అమరావతి పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు.

*చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ