ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 15: ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు చెరుగుతున్నారు. తొమ్మిది మాసాల పాలనలో ఏనాడూ ఇలాంటి చేదుఅనుభవం తనకు ఎదురుకాకపోవడంతో దీన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్నికల కమిషనర్ ప్రకటన వెలువడిన మరుక్షణమే జగన్ హుటాహుటిన ఆయన రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో దాదాపు గంటా 20నిమిషాలు ముఖాముఖి చర్చించారు. ప్రధానంగా కరోనా నివారణపై తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అర్థంతరంగా ఎన్నికల వాయిదా వల్ల జరిగే కష్టనష్టాలు వివరించారు. కరోనాపై ఎన్నికల కమిషనర్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. మరోవైపు కలెక్టర్ల బదిలీలు ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అసలు ఆయనకు అధికారం ఎక్కడదని ప్రశ్నించారు. కనీసం ముందుగా హెల్త్ సెక్రటరీ, లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించి, వారి నుంచి నివేదిక కోరి ఉంటే బాగుండేదని సీఎం గవర్నర్‌తో అన్నట్లు తెలిసింది. ప్రజలు ఓట్లువేసి 151స్థానాలు ఇస్తేనే తాము అధికారంలోకి వచ్చామని, ఏనాడో చంద్రబాబు పదవి ఇచ్చినంత మాత్రాన ఇంత వివక్ష ప్రదర్శిస్తే ఎలా అని కూడా ప్రశ్నించినట్లు సమాచారం. బాబు హయాంలోనే రమేష్‌కుమార్ కుమార్తె శరణ్య ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డుకు అసోసియేట్ డైరెక్టర్‌గా నియమితులైన విషయాన్ని కూడా సీఎం జగన్ గవర్నర్ వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ఇదిలావుండగా సీఎం జగన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేయటంతోనే సరిపెట్టుకోకుండా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. రమేష్‌కుమార్‌పై పార్టీ పరంగానే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఫిర్యాదు చేయదలిచారు. ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులు నిప్పులు చెరిగారు.
ఎన్నికల కమిషన్
కార్యాలయానికి భద్రత
విజయవాడ బందరు రోడ్డులో రాజ్‌భవన్‌కు కూతవేటు దూరంలో ఉన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి ఆదివారం సాయంత్రం నుంచి సాయుధ పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఇదిలావుండగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సోమవారం ఉదయం 11గంటలకు భేటీ కానున్నారు. స్థానిక ఎన్నికల నిలిపివేతకు కారణాలను వివరించనున్నారు. సీఎం జగన్ లేవనెత్తిన అభ్యంతరాలపై కూడా ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది.
*చిత్రం... గవర్నర్ హరిచందన్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి