ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికలపై బహిరంగ చర్చకు రండి: మల్లాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 16: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై బురద జల్లుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బహిరంగ చర్చకు రావాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు సవాల్ విసిరారు. బాబుతో బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి జగన్ అవసరం లేదని, తేదీ, స్థలం నిర్ణయిస్తే తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆరోపణలు చేసి పలాయనం చిత్తగించటం చంద్రబాబు నైజమని విమర్శించారు. దేనికైనా ధైర్యంగా నిలబడగలిగే శక్తి సీఎం జగన్‌కు ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చంద్రబాబు చేసిన ఆరోపణల్లో ఒకటి కూడా నిరూపించలేక పోయారన్నారు. నిష్పక్షపాతంగా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను సైంధవుడిలా చంద్రబాబు అడ్డుకున్నారని సోమవారం ఒక ప్రకటనలో మల్లాది ధ్వజమెత్తారు. ఎన్ని కుతంత్రాలు, కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదన్నారు. ఓటమి భయంతోనే మళ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలంటూ స్వరం మారుస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన అరాచకాలపై కూడా చంద్రబాబు చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఓవైపు ఓటమి భయం, మరోవైపు వలసల పర్వంతో ఆయన మతిస్థిమితం కోల్పోతున్నారని విమర్శించారు. అధికారులు తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే వైసీపీ ముద్రవేయటం బాబు నైజమన్నారు. గతంలో ఎన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి స్థానిక సంస్థల్లో విజయం సాధించారని ప్రశ్నించారు. సీఎం జగన్ ముందు నుంచి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైతే చట్టాన్ని సైతం సవరించేందుకు వెనుకాడలేదని మల్లాది విష్ణు గుర్తుచేశారు.