తెలంగాణ

రేపటి నుంచి టెన్త్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. పదో తరగత పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని, పరీక్షలంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె కోరారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంగళవారం నాడు విద్యాశాఖ అధికారులతో తన కార్యాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19 నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకూ నిర్వహించే పరీక్షలకు 5,34,903 మంది విద్యార్థులు రా యనున్నట్టు మంత్రి తెలిపారు. ఇందులో బాలికలు 2,60,932 మంది కాగా బాలురు 2,73, 971 మంది ఉ న్నారని తెలిపారు. మొత్తం విద్యార్థుల్లో 5,09,079 మం ది రెగ్యులర్ కాగా 25,824 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారని ఆమె చెప్పారు. ఇందుకోసం 2,530 కేంద్రాల ను ఏర్పాటు చేశామని అన్నారు. కమిషనర్ కార్యాల యం నుండి నాలుగు స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు నియమించామని ఆమె అన్నారు.
విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరడానికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందే చేరుకోవాలని, ఆందోళనకు, భయానికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు. ఎవరైనా విద్యార్థులు జలుబు, దగ్గుతో బాధపడుతూ అనారోగ్యంగా ఉంటే వారి కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. పరీక్షలకు హాజరయ్య విద్యార్థులు తమ చేతులను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతిపరీక్ష కేంద్రంలోనూ శానిటైజర్లు లేదా లిక్విడ్ సోప్‌లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. విద్యార్థులు మాస్క్‌లు ధరించినా అనుమతిస్తామని, విద్యార్థులు తీసుకువచ్చే వాటర్ బాటిళ్లను కూడా అనుమతిస్తామని మంత్రి తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో
ఇన్విజిలేటర్లను రిజర్వులో ఉంచుతామని, ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారి స్థానంలో ఇతరులకు అవకాశం కల్పిస్తామని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు గుంపులుగా చేరకుండా ఉండేందుకు ఉదయం 8.30 నుండే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని అన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని, ఇంతవరకూ సుమారు నాలుగు లక్షల మంది తమ హాల్‌టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని అన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రాల్లో ఇద్దరేసి వైద్య సిబ్బందిని నియమిస్తామని, వారితో పాటు అవసరమైన మందులు, ఓఆర్‌ఎఏస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచామని అన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వ పరీక్ష కార్యాలయంలో, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో 24 గంటలూ పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్‌లు పెట్టామని అన్నారు. 040-23230942 నెంబర్‌కు ఏ సమాచారం ఉన్నా తెలియజేయవచ్చని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, రమణకుమార్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రా రెడ్డి