ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 17: రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న కుట్రలో భాగంగా ప్రభుత్వం, పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. మంగళవారం గుంటూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ 82వ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగంపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాజ్యాంగపరంగా ఏర్పడిన అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గౌరవించాలని, అందుకు విరుద్ధంగా ప్రవర్తించ కూడదన్నారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అనే విషయాన్ని అధికార పార్టీ నేతలు గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించాలేతప్ప వారి అధికారాల్లో జోక్యం చేసుకోకూడదన్నారు. ప్రపంచమంతా కరోనా వైరస్‌కు భయపడి జాగ్రత్తలు తీసుకుంటుంటే జగన్ మాత్రం తేలిగ్గా మాట్లాడుతున్నారని అన్నారు.