ఆంధ్రప్రదేశ్‌

బెదిరింపులకు భయపడి పరిశ్రమలు వెనక్కి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), మార్చి 17: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోతే కేంద్ర వద్ద నుంచి రావాల్సిన నిధులను ఏదోవిధంగా కేంద్రాన్ని ఒప్పించి తెచ్చుకోవచ్చని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ వైసీపీ నాయకుల బెదిరింపులకు భయపడి రాష్ట్రం నుండి వెనక్కిపోయిన పరిశ్రమలను తిరిగి ఎలా తీసుకొస్తామని మంగళవారం ట్విట్టర్‌లో ప్రశ్నించారు. విశాఖలో రూ. 70వేల కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాలతో రావాల్సిన అదానీ సంస్థ, తిరుపతిలో రావాల్సిన రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, అమరావతికి రావాల్సిన సింగపూర్ కన్నార్టియం వెనక్కి పోయాయని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా వంతు వచ్చిందన్నారు. ఆసియన్ పేపర్ మిల్స్‌ను కూడా తరిమేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడితే ఎంపీలతో ఒత్తిడి చేయించో, కేంద్రానికి లేఖలురాసో ఏపీకి రావాల్సిన రూ. 4వేల కోట్లు అడిగి తెచ్చుకోవచ్చన్నారు. కానీ మీ బెదిరింపులకు భయపడి పారిపోయిన కంపెనీలు, పెట్టుబడులు, ఉద్యోగాలను మళ్లీ ఏవిధంగా వెనక్కి తేగలమని పరోక్షంగా సీఎం జగన్‌ను ప్రశ్నిస్తూ పలు పేపర్ క్లిప్పింగులను చంద్రబాబు ట్విట్టర్‌కు ట్యాగ్ చేశారు.