ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుకు పాస్‌పోర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా పాస్‌పోర్ట్ తీసుకున్నారు. ఇదివరకే హైదరాబాద్ చిరునామాలో సికిందరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి 2014 నవంబర్‌లో డిప్లమాటిక్ పాస్‌పోర్ట్ పొందిన చంద్రబాబు చిరునామా మార్పుతో కొత్తగా పాస్‌పోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. తన పాస్‌పోర్ట్ చిరునామాను ఉండవల్లికి మార్చుకున్నారు. ఇప్పటికే చిరునామా మార్పుకోసం చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు. అంతర్జాతీయ సీ ఫుడ్‌షో ప్రారంభించేందుకు విశాఖ వచ్చిన ఆయన పాస్‌పోర్ట్ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కొత్తగా పాస్‌పోర్ట్ తీసుకున్నారు. సిఎం చంద్రబాబుకు ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి ఎన్‌ఎల్‌ఆర్ చౌదరి స్వాగతం పలికారు. నిబంధనల మేరకు కుడి, ఎడమ బొటనవేలి ముద్రలు తీసుకున్న అనంతరం చంద్రబాబుకు పాస్‌పోర్ట్ జారీ చేశారు. ఈ సందర్భంగా పాస్‌పోర్ట్ కార్యాలయానికి సంబంధించి స్థల సమస్యను సిఎం దృష్టికి తీసుకువెళ్లగా, పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు.

చిత్రం.. పాస్‌పోర్ట్ తీసుకునేందుకు విశాఖలో పాస్‌పోర్ట్ ప్రాంతీయ కార్యాలయానికి విచ్చేసిన సిఎం చంద్రబాబు