ఆంధ్రప్రదేశ్‌

ఎయిడెడ్ విద్యాసంస్థలపై ప్రభుత్వం ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 18: రాష్ట్రంలోని ఎయిడెడ్ స్కూల్స్, కళాశాలల వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. వీటికి ఉన్న ఆస్తులు, వాటి విలువ, సిబ్బంది సంఖ్య, వారికి చెల్లిస్తున్న జీతాలు తదితర వివరాలు సేకరిస్తోంది. అలాగే ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనే వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్‌జేడీ) కార్యాలయ అధికారులు, జిల్లాల విద్యాశాఖ కార్యాలయాల అధికారులు వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఎయిడెట్ విద్యాసంస్థలకు ఉన్న భవనాలు, స్థలాలు, విస్తీర్ణం విలువ తదితరాలు సైతం సేకరిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తున్నారు. ఏనాడో ఏర్పాటుచేసిన ఈ విద్యాసంస్థలకు అప్పట్లో కొందరు దాతలు భారీగా ఆస్తులను విరాళాలుగా సమకూర్చారు. ప్రస్తుతం దాదాపు అన్ని ఎయిడెడ్ విద్యాసంస్థలకు కోట్ల రూపాయల విలువైన స్థలాలు, పొలాలు, భవనాలు ఉన్నాయి. ఈ సంస్థలకు అవసరమైన సిబ్బంది నియామకాలకు ప్రభుత్వం అనుమతించినపుడు నేరుగా నియామకాలు చేపడుతుంటారు. నిర్దేశిత పోస్టులకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది. విద్యాసంస్థల ఆస్తుల వివరాలు కచ్చితంగా చెప్పని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయా వర్గాలు భావిస్తున్నాయి. ఆస్తుల వివరాలు వెల్లడించకపోతే భవిష్యత్తులో ఈ కళాశాలలు , పాఠశాలలకు కొత్తగా ఉద్యోగాల భర్తీకి అవకాశం కల్పించకపోవచ్చు. వీటిలో చదివే విద్యార్థులకు పరీక్షల నిర్వహణ కూడా ఆ పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ ఎయిడెడ్ కళాశాలల్లో విద్యార్థులకు అందుతున్న ప్రభుత్వం సహాయంలో నిబంధనలు కట్టుదిట్టం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన వివరాల సేకరణ ఆయా సంస్థల యాజమాన్యాలను కలవరానికి గురిచేస్తోంది. భవిష్యత్తులో ఈ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.