ఆంధ్రప్రదేశ్‌

ఎస్‌ఈసీ రాజకీయ కోణం సుప్రీం తీర్పుతో బట్టబయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 18: రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన పరిధి దాటిందని, రాజ్యాంగం ప్రకారం తాను చేయాల్సిన పనికాకుండా ఎస్‌ఈసీ వ్యవహరించిందని సుప్రీం కోర్టు తీర్పు ద్వారా ప్రజలకు అర్థమైందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయం రాజకీయ కోణంలో ఉందని సుప్రింకోర్టులో న్యాయమూర్తులు ప్రశ్నించిన విధానాన్ని బట్టిచూస్తే స్పష్టమవుతుందన్నారు. ఎన్నికలను వాయిదా వేస్తూనే మరోపక్క కోడ్‌ను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం పనిచేయకుండా స్తంభింపజేయడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య పట్ల స్పందించకుంటే చాలా దౌర్భాగ్యంగా ఉండేదని, చారిత్రాత్మకమైన తీర్పు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుందన్నారు. ఎన్నికలు వాయిదా వేసేటప్పుడు, రద్దు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంటుందన్నారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని సంప్రదించకుండా వెళ్లడం తప్పు అని కోర్టు చెప్పిందంటే ఎన్నికల కమిషన్ సిగ్గుపడాలన్నారు. ఎన్నికల అంశంలోకి చొరబడి వ్యవస్థలను తన ఇష్టం వచ్చినట్లు నడిపి రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేస్తే ఈ దేశంలో న్యాయస్థానాలు ఒప్పుకోవనే సందేశం ఇచ్చిందన్నారు. ఎన్నికల కమిషన్ ముసుగులో వెనుక ఉండి వ్యవహారాలు నడిపేవారికి నేటి సుప్రీం తీర్పు చెంపపెట్టు లాంటిందని అంబటి స్పష్టం చేశారు.