ఆంధ్రప్రదేశ్‌

ప్రవాసాంధ్రులు, విద్యార్థుల కోసం రెండు కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: కరోనా ప్రభావిత దేశాల్లో విద్యా సంస్థలను మూసేసి స్వదేశాలకు వెళ్లాలని విద్యార్థులను, ప్రవాసాంధ్రులను ఆయా దేశాలు ఆదేశిస్తున్న నేపథ్యంలో వారికి సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్, వెలగపూడి సచివాలయంలోని ఏపీఎన్నార్టీ కార్యాలయంలో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఏపీ భవన్‌లో పి రవిశంకర్, దేవేందర్‌ను, సచివాలయంలో షేక్ కరీముల్లా, డి మోహన్ కుమార్‌లను సంప్రదించాలని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్వదేశం రావాలనుకునే విద్యార్థులు, వ్యక్తుల వివరాలను ట్రాక్ చేసేందుకు హ్యాండ్ హోల్డింగ్ అధికారులను నియమించనున్నారు. స్వదేశానికి రావాలనుకునే వారి వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకొచ్చే బాధ్యతను ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించారు. హైలెవెల్ టాస్క్ఫోర్సును కూడా నియమించారు. ఇందులో మంత్రులు ఆళ్ల నాని, మేకపాటి గౌతం రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మేడపాటి వెంకట్ సభ్యులుగా ఉంటారు. విదేశాల నుంచి తరలింపునకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు గురువారం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరో నలుగురు ఐఏఎస్‌లు
కరోనా (కోవిడ్-19) వైరస్ నియంత్రణ, నిరోధానికి సంబంధించి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రత్యేకాధికారి కె విజయ రామరాజుకు సహాయం చేసేందుకు నలుగురు ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పోలవరం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ ఓ ఆనంద్, చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వితేజ్ ఇమ్మాది, కర్నూలు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ విదేహ్ ఖరే, విజయనగరం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ కేతన్ గర్గ్‌లను రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.