రాష్ట్రీయం

అన్నవరంలో సత్యదేవుని వ్రతాలు, ఆర్జిత సేవలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నవరం, మార్చి 19: శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సత్యదేవునికి ప్రతిరోజూ నిర్వహించే సుప్రభాత సేవ, హారతి సేవ, నిత్య కల్యాణంతోపాటు ఆర్జిత సేవలు, భక్తులు సామూహికంగా నిర్వహించుకునే వ్రతాలను కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా శుక్రవారం నుండి రద్దు చేస్తున్నట్టు గురువారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. దేవదాయ శాఖ ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు రావడంతో వీటిని రద్దు చేస్తున్నట్టు ఈవో తెలిపారు. వీటితోపాటు భక్తులకు స్వామి వారి అంతరాలయ ప్రవేశాన్ని రద్దు చేసి, సాధారణ దర్శనానికి మాత్రమే అనుమతిస్తామన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు రత్నగిరికి వచ్చే భక్తులు క్యూలైన్లలో ఒక్కొక్కరికి 3 అడుగుల చొప్పున దూరం దూరంగా నిలబడి దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశామన్నారు. సత్యదేవునికి మొక్కుబడిగా తలనీలాలు సమర్పించాలనుకునే భక్తులు మూడు వారాలపాటు యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించారు. భక్తులు తలనీలాలు సమర్పించే కేశఖండన శాలను కూడా మూసివేస్తున్నట్టు తెలిపారు. కొండపైకి వెళ్లే వాహనాల ప్రధాన టోల్‌గేటు మరియు మెట్ల మార్గం (తొలి పావంచాల) వద్ద రత్నగిరికి వచ్చే భక్తులను ధర్మల్ గన్‌తో పరీక్షలు నిర్వహించిన అనంతరం మాత్రమే కొండపైకి అనుమతిస్తామన్నారు. దర్శనానంతరం భక్తులకు పులిహోరా గాని, దద్దోజనం గాని, సాంబారు రైస్ గాని ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి భక్తులకు అందించేలా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. రత్నగిరి, సత్యగిరిలను 24 గంటలూ పరిశుభ్రంగా ఉంచే విధంగా ప్రత్యేకంగా శానిటరీ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులను, అదనంగా 15 మంది సిబ్బందిని నియమించి ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా తగిన ఆదేశాలిచ్చామన్నారు. దేవస్థానానికి వచ్చే భక్తులు గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు. దేవస్థానం ఆలయ పరిసరాలను, వసతి సముదాయాలను ప్రతి 2 లేదా 3 గంటలకు ఒకసారి 1 శాతం సోడియం హైపో క్లోరైడ్ కలిపిన నీటిని పిచికారీ చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. 10 సంవత్సరాలలోపు, 60 సంవత్సరాల పైబడి వయసు గల వారిని దేవస్థానానికి తీసుకురావద్దని భక్తులకు ఈవో సూచించారు. ఈ సమావేశంలో ఆలయ ట్రస్టుబోర్డు సభ్యులు చాగంటి వెంకట సూర్యనారాయణ, వాసిరెడ్డి జమీల్, గాదె రాజశేఖర్‌రెడ్డి, మెడికల్ స్పెషల్ నోడల్ ఆఫీసర్ రమేష్‌తోపాటు దేవస్థానం పీఆర్వో కొండలరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
*చిత్రం...భక్తులు లేక ఖాళీగా ఉన్న క్యూలైన్లు