తెలంగాణ

శ్రీశైలంలో అన్నీ బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 19: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో శ్రీశైలం దేవస్థానం అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్కొక్కటిగా అన్నీ బంద్ చేయిస్తున్నారు. మల్లికార్జున స్వామి దర్శనానికి వస్తున్న భక్తులకు వీలైనంత త్వరగా దర్శనాలు చేయించి తిరిగి స్వస్థలాలకు పంపుతున్నారు. ఇప్పటికే శ్రీగిరిపై ఉన్న అన్ని దుకాణ సముదాయాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆలయంలో పూజలు, ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను నిలిపివేశారు. అలాగే అన్న ప్రసాదాలను కూడా సమూహంగా కాకుండా ప్యాకెట్ల రూపంలో భక్తులకు అందజేస్తున్నారు. భక్తులకు గోఆర్క్ పంపిణీ చేస్తున్నారు. సిబ్బంది ప్రతి భక్తుడిని విధిగా పరీక్షించి ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే వైద్యశాలకు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వీరపాండియన్, కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సరిహద్దుల్లోని 14 జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసి శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలను రద్దు చేశామని, భక్తులు శ్రీశైలం రాకుండా అక్కడే నిలిపివేయాలని కోరారు. అలాగే కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీస్ బలగాలతో చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. కన్నడ భక్తులు ముందుకు సాగకుండా అక్కడే అడ్డుకుని వెనక్కు పంపుతున్నారు. దీంతో శ్రీశైలం చేరుకునే కన్నడ భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ శ్రీశైలంలో గురువారం రాత్రి సమయానికి సుమారు 80 వేల మంది భక్తులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వీరందరికీ శరవేగంగా స్వామి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
భక్తులు ఖాళీ కాగానే ఆలయ దర్శనాలను నిలిపివేసే అవకాశం ఉంది. అత్యవసరమైతే భక్తులు ఉన్నప్పటికీ దర్శనాలు నిలిపివేసి స్వగ్రామాలకు తిరిగి పంపే ఏర్పాట్లు చేస్తామని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.
సింహాచలేశుని దర్శనాలు నిలపివేత
సింహాచలం,: కరోనా వైరస్ ప్రభానాన్ని దృష్టిలో పెట్టుకొని చారిత్రక ప్రాధాన్యం గల సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయంలో భక్తుల దర్శనాలను శుక్రవారం నుండి నిలిపివేస్తున్నట్టు దేవస్థానం ఈవో ఎం.వెంకటేశ్వరరావు ప్రకటించారు. కరోనా వైరస్ రోజురోజుకి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలానుసారం దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఉన్నధికారుల ఆదేశాల మేరకు గురువారం రాత్రి ధర్మకర్తలు జి.మాధవి, సూరిశెట్టి సూరిబాబు, అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈవో వివరాలను విలేఖరులకు వెల్లడించారు. ట్రస్ట్‌బోర్డు సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ఉన్నతాధికారులు సూచనలను తెలిపినట్టు ఈవో చెప్పారు. స్వామివారి దేవాలయంలో జరిగే నిత్య కైంకర్యాలకు ఎటువంటి ఆటంకం ఉండదని, శాస్త్ర, సంప్రదాయాలను అనుసరించి భగవంతుడి సేవలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. సింహగిరికి ఆర్టీసీ సర్వీసులను కూడా నిలిపివేస్తున్న ఈవో ప్రకటించారు. స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు కొండ దిగువ తొలిపావంచా వద్ద పూజలు చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. కాగా గురువారం విదేశీయ భక్తులు కొంత మంది సింహాచలేశుని దర్శనానికి వచ్చారు.