ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని చంద్రబాబు అండ్ కో కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 19: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఓ వర్గం కుట్ర పన్నుతున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. గురువారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిసిన అనంతరం వారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. లేఖలోని అంశాలు వైసీపీ, ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత రాష్ట్రంలో అనూహ్యమైన పరిణామాలు జరుగుతున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేంద్ర హోం శాఖకు ఐదు పేజీల లేఖ రాశారని, అది వారికి చేరడంతో పాటు సోషల్ మీడియా, ఓ వర్గం మీడియాలో హల్‌చల్ చేసిందన్నారు. ఇది నకిలీ లేఖ అని, వాస్తవం కాదని నిమ్మగడ్డ రమేష్ రాయలేదని మళ్లీ వారే ప్రచారం చేశారన్నారు. ఇదంతా పెద్దకుట్రగా అవగతమవుతోందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వంపై కుట్రలు చేసి అభాసుపాలు చేయాలన్నదే వారి అభిమతంగా ఉందని, ఈ కుట్రలను ఆదిలోనే కట్టడి చేయాలన్నారు. ఓ వర్గం మీడియా పతాక శీర్షికల్లో ఐదు పేజీల లేఖను ప్రచురించి చివరగా రమేష్‌కుమార్ ఇంకా ధ్రువపర్చలేదని పేర్కొన్నారన్నారు. ఆయన రాశారో, రాయలేదో తెలియని లేఖను ప్రచురించడం కుట్రలో భాగం అవునో, కాదో మేధావులు, సామాన్యులే గ్రహించాలన్నారు. అందుకే దీనిపై సమగ్ర విచారణ చేపడితే అసలు దోషులు ఎవరో ప్రజలకు తెలుస్తుందని డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశామని వైసీపీ ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, అంబటి రాంబాబు, జోగి రమేష్, శ్రీకాంత్‌రెడ్డి, మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్‌బాబు, కే అనిల్‌కుమార్ వివరించారు.