ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ కొనుగోలులో 5వేల కోట్ల కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ కొనుగోలులో ఐదువేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని శాసనసభలో విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. విద్యుత్ తదితర శాఖలకు చెందిన డిమాండ్లపై శనివారం శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొంటూ, పగటివేళ ఒక యూనిట్ విద్యుత్తు 3.67 రూపాయలకు, రాత్రివేళ 2.71 రూపాయలకు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, యూనిట్‌కు 5.11 రూపాయలు ట్రాన్స్‌కో, డిస్కాంలు చెల్లిస్తున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎక్కువ ధరను ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు లంచాలకోసం ప్రజలపై విద్యుత్ చార్జీలు ఇతర పేర్లతో భారం వేస్తున్నారని విమర్శించారు. ఎపిఇఆర్‌సి ఉత్తర్వులను కూడా టిడిపి ప్రభుత్వం ఖాతరు చేయకుండా అడ్డగోలుగా విద్యుత్తు కొనుగోలు చేస్తోందని విమర్శించారు. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ (ఐఇఇ) హెచ్చరించినప్పటికీ, ఎక్కువ ధరనే ప్రభుత్వం ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నారని ఆరోపించారు.
ఆధారాలు లేకుండా జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపణలు చేయడం సబబు కాదని కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ఈ సందరర్భంగా పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, యూనిట్‌కు 13.50 రూపాయలు కూడా చెల్లించి కొనుగోలు చేశారని ఆరోపించారు. వైకాపా నుండి ఎమ్మెల్యేలు జారి పోకుండా చూసుకోవాలంటూ జగన్‌కు అచ్చెన్నాయుడు సలహా ఇచ్చారు. మంత్రి కామినేని శ్రీనివాస్, శాసనసభలో ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాస్ తదితరులు జగన్‌పై విరుచుకు పడ్డవారిలో ఉన్నారు.