ఆంధ్రప్రదేశ్‌

31వరకు రైళ్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), మార్చి 22: కరోనా వైరస్ కారణంగా ఆదివారం అర్ధరాత్రి 12గంటల నుంచి ఈ నెల 31వరకు భారతీయ రైల్వే అంతటా రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నారని దక్షిణ మధ్య రైల్వే పౌర సంబంధాల ప్రధానాధికారి సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్‌ని నివారించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒకరోజు జనతా కర్ఫ్యూని దేశమంతటా పాటించడంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో సైతం ఎవరికి వారుగా పూర్తిస్థాయిలో స్పందించారు. ఇందులో భాగంగానే దూర ప్రాంతాలకు నడిచే రైళ్లు మినహా మిగిలిన సూపర్‌ఫాస్ట్, ఇంటర్ సిటీ, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ఆదివారం ఒక్కరోజు రద్దుచేశారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన రైల్వేబోర్డు సమావేశంలో దూరప్రాంతాల ద్వారా రాకపోకలు సాగించే పలు రైళ్ల వల్ల కరోనా వైరస్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాపిస్తుందని భావించి ఒక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికితోడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రైల్వేబోర్డు చైర్మన్‌కి ఫోన్ చేసి దూర ప్రాంతాల నుంచి కోల్‌కత్తాకు వచ్చే రైళ్లను నగరంలోకి రాకుండా నిలిపివేస్తామని, లేదా బోర్డు నిర్ణయం తీసుకుని ఈ విషయంలో స్పందించాలని కోరినట్లు సమాచారం. ఇదే తరహాలో జార్ఖండ్ ముఖ్యమంత్రి రైల్వేబోర్డుకి ఫోన్ చేసి ఇతర ప్రాంతాల నుంచి దూరప్రాంత రైళ్లను కొద్దిరోజులు తమ ప్రాంతానికి రాకుండా నిలిపివేయాలని కోరినట్లు తెలిసింది. తమిళనాడు రాష్ట్రంలో రోడ్డు మార్గాన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను ఊరికి బయట నిలిపివేయడంతో ట్రాఫిక్ జామ్ అయిందనే విషయాన్ని తెలుసుకున్న రైల్వేబోర్డు ఆదివారం జరిపిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో 22న అర్ధరాత్రి 12గంటల నుంచి ఈ నెల 31వరకు భారతీయ రైల్వే అంతటా రైళ్ల రాకపోకలు నిలిపివేస్తున్నారని రాకేష్ వివరించారు. ఇతర ప్రాంతానికి అత్యవసర పరిస్థితి కాని, మరే ఇతర పరిస్థితుల్లోనైనా సరుకు రవాణా చేయాల్సి వస్తే గూడ్స్ ట్రాన్స్‌పోర్టు నడుస్తుందన్నారు. రైళ్లు పూర్తిస్థాయిలో కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా తొమ్మిది రోజులు రద్దుచేయటంతో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఎలాంటి తగ్గింపు లేకుండా పూర్తిగా డబ్బు వాపస్ చేస్తారని వివరించారు.