ఆంధ్రప్రదేశ్‌

ప్రజల ప్రాణాల్ని కాపాడిన ఎస్‌ఈసీ తొలగింపు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడిన రమేష్‌కుమార్‌ను ఎస్‌ఈసీ పదవి నుండి తొలగించడం అన్యాయమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు.
ఒక రాజ్యాంగ సంస్థ అధిపతిని అప్రజాస్వామికంగా తొలగించారన్నారు. ప్రాణాలు కాపాడిన వ్యక్తిని ఈవిధంగా తొలగించడం దుర్మార్గపు చర్య అని ఖండించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల ప్రాణాలు పోయినా ఫర్వాలేదు కానీ రాజకీయ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో క్వారంటైన్‌ను ఒక ప్రహసనంగా మార్చేశారన్నారు. తమకు నచ్చినవారిని స్వేచ్ఛగా తిరగనిస్తున్నారని ఆరోపించారు. ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించిన కనగరాజ్ చెన్నై నుండి రావడానికి, కాంట్రాక్టర్లు హైదరాబాద్ నుంచి రావడానికి లేని అభ్యంతరాలు సామాన్య ప్రజలు, వలస కార్మికులను రాష్ట్ర సరిహద్దులు దాటటానికి ఎందుకని ప్రశ్నించారు. మీతోపాటు ఐదుగురికి భోజనం పెట్టాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిస్తే మన రాష్ట్రంలో పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటిన్లను మూసివేసిన చరిత్ర సీఎం జగన్‌దని విమర్శించారు.
ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలని, అన్న క్యాంటీన్లు తెరిచి, బీమాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వీటిపై దీక్ష చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, గద్దె అనూరాధలను ఈసందర్భంగా చంద్రబాబు అభినందించారు. రాజధాని ప్రాంతం గుంటూరు, కృష్ణా జిల్లాలు రెడ్‌జోన్‌లోకి రావడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని జిల్లా ప్రాతిపదికగా విశే్లషించాలే తప్ప మండలం ప్రాతిపదికన తక్కువగా చూపించడం దురుద్దేశ్య పూర్వకమే అవుతుందన్నారు.
నిత్యావసర ధరలను నియంత్రించాలని, గత పది రోజుల్లోనే పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు రెట్టింపయ్యాయని తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో పేద కుటుంబాలకు అందుబాటులో ఉంటూ బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను అభినందించారు. అంబేద్కర్ జయంతిని ఎక్కడికక్కడ ఇళ్లల్లోనే ఘనంగా నిర్వహించాలని, ఆయన చిత్రపటాలకు ఇళ్లల్లోనే పూలమాలలు వేసి నివాళులర్పించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.