ఆంధ్రప్రదేశ్‌

రెడ్‌జోన్ ప్రాంతాల్లో హోమియో మాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 13: కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు రెడ్‌జోన్ ప్రాంతాల్లో పెద్దఎత్తున కోవిడ్-19 (కరోనా) నివారణకు ముందస్తుగా హోమియో మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని సీనియర్ ఐఏఎస్ అధికారిణి, రాష్ట్ర ఆయుష్ శాఖ కమిషనర్ పి ఉషాకుమారి తెలిపారు.
సోమవారం కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం వచ్చిన ఆమె స్థానిక రెడ్‌జోన్ ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు హోమియో మాత్రలను బందరు ఆర్డీవో ఖాజావలీ, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ శివరామకృష్ణకు అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి కోటి డోసుల హోమియో మాత్రలు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా అందినట్టు తెలిపారు.
గత ఫిబ్రవరిలో హోమియో మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఫిబ్రవరి నెల రోజుల పాటు ఆయుష్ డిస్పెన్సరీలలో పంపిణీ చేశామన్నారు. మార్చి 1నుండి 15వరకు పెద్దఎత్తున శిబిరాలు నిర్వహించి కోవిడ్-19 నివారణకు హోమియో మాత్రలు పంపిణీ చేసినట్టు తెలిపారు. నేడు కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రెడ్‌జోన్‌లుగా ప్రకటించిన ప్రాంతాల్లో డోర్ టూ డోర్ ప్రజలకు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా ప్రతి రెడ్‌జోన్ ఏరియాకు అవసరమైన డోస్‌లను సరఫరా చేస్తున్నామన్నారు. వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. మూడురోజుల పాటు ప్రతి రోజూ ఉదయం పడగడుపున ఈ మాత్రలు వేసుకోవాల్సి ఉంటుందన్నారు. పెద్దలు ఆరు, చిన్న పిల్లలు ఆరు మాత్రలు చొప్పున వేసుకోవాలన్నారు. ఆరు నెలల వయస్సు దాటిన పిల్లల నుండి ప్రతిఒక్కరూ వీటిని విధిగా వేసుకోవడం వల్ల కొంతలో కొంత కోవిడ్-19 వ్యాధిని నివారించవచ్చన్నారు. హోమియో మాత్రల పంపిణీకి రాష్ట్రంలోని 13జిల్లాలకు నోడల్ అధికారుల నియామకం చేపట్టామన్నారు. ప్రతి నియోజకవర్గానికీ పీజీ స్కాలర్స్‌ను ప్రత్యేక అధికారులుగా నియమించామని ఆమె చెప్పారు. హోమియో మాత్రలు ఏవిధంగా వేసుకోవాలనే దానిపై వీరంతా వలంటీర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారని ఉషాకుమారి వివరించారు. కార్యక్రమంలో ఆయుష్ శాఖ ఏడీ డా. పురుషోత్తం, డా. సింధూజ, డా. లహరి, మచిలీపట్నం తహశీల్దార్ సునీల్‌బాబు, మెడికల్ ఆఫీసర్ డా. వై బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

*చిత్రం...మచిలీపట్నం ఆర్డీవో, నగరపాలక సంస్థ కమిషనర్‌కు కోవిడ్-19 నివారణ హోమియో మాత్రలు అందజేస్తున్న దృశ్యం