ఆంధ్రప్రదేశ్‌

ఉద్యమకారులకు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 13: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 విస్తరిస్తున్నప్పటికీ రాజధాని ఉద్యమం పేరిట బయట తిరుగుతూ, ఒకరినొకరు కలుసుకోవడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. సోమవారం ఈ మేరకు రాజధాని పరిధిలోని వెంకటపాలెం గ్రామస్తులకు పోలీసులు నోటీసులు జారీచేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈనెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు యూనియన్ బ్యాంకు సమీపంలో అమరావతి జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంపై పోలీసులు నోటీసులో అభ్యంతరం వ్యక్తం చేశారు. 12 నండి 15 మంది ఒకేచోట ఉద్యమం చేస్తున్నారని, లాక్‌డౌన్ సమయంలో బయట తిరగడం, ఒకరినొకరు కలవడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్ అమలులో ఉందని, ఈ దృష్ట్యా సెక్షన్ 188, 269, 270, 271 ప్రకారం చట్టరీత్యా నేరమని నోటీసులో పేర్కొన్నారు. ఈ కారణాల మూలంగా మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలని నోటీసులో తుళ్లూరు పోలీసులు స్పష్టంచేశారు.