ఆంధ్రప్రదేశ్‌

జీజీహెచ్‌లో కలకలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట), ఏప్రిల్ 13: గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు కరోనా సెగ తగిలింది. వైద్యశాలలోని గుండె శస్త్ర చికిత్స విభాగంలో ఇటీవల చికిత్స పొందిన తెలంగాణకు చెందిన ఓ వ్యక్తికి ఆదివారం సాయంత్రం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతనికి చికిత్స అందించిన వైద్యులు, నర్సులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి తన పనుల నిమిత్తం ఈనెల 8వ తేదీన విజయవాడకు వచ్చారు. గుండె సంబంధిత వ్యాధి లక్షణాలతో అక్కడి వైద్యులను సంప్రదించగా విజయవాడ ప్రభుత్వ వైద్యశాల నుండి 9వ తేదీ ఉదయం 4 గంటలకు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్ చేశారు. అనంతరం అతనికి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలోని గుండె శస్త్ర చికిత్స విభాగంలోని సీసీయూలో అన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం గుండె సంబంధిత లక్షణాలు కనిపించక పోవడం, కరోనా లక్షణాలు బయటపడటంతో వైద్యులు జ్వరాల ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాల ఉలిక్కి పడింది. ఆ వ్యక్తికి వైద్య సేవలు అందించిన సిబ్బంది, వైద్యులు ఆందోళనకు గురై గుండె శస్త్ర చికిత్స విభాగం హెచ్‌ఓడీని సంప్రదించగా మాస్క్‌లు, గ్లౌజ్‌లు ధరించి వైద్యసేవలు అందించిన వారు క్వారంటైన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదంటూ సలహా ఇచ్చారు. దీనితో అవాక్కైన వైద్యులు ఈ విషయాన్ని సూపరింటెండెంట్ రాజునాయుడి వద్దకు తీసుకెళ్లారు. వెంటనే ఆ వ్యక్తికి సేవలు అందించిన వారికి స్వాబ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. అయితే ఆ వ్యక్తికి వైద్య సేవలు అందించిన వైద్యులు, సిబ్బంది ఆందోళన చెందుతుండటం ప్రస్తుతం ఆసుపత్రిలో చర్చనీయాంశమైంది.