ఆంధ్రప్రదేశ్‌

అయితే.. నిజమేంటో చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: విభజన ముందు గంటలో స్పీకర్ చాంబర్‌లో ఏమి జరిగిందో నిజాన్ని బయటపెట్టాలని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి హృదయం దహిస్తోందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. తను రాసిన విభజన కథ పుస్తకం కట్టు కథ అయితే అసలు నిజమేమిటో జైపాల్ రెడ్డి బయటపెట్టాలన్నారు. విభజన కథ పుస్తకంలో ఉండవల్లి కట్టు కథ రాశారని, అసలు విషయం బయటపెట్టాలంటే చాలా సున్నితమైన అంశం కాబట్టి చెప్పడానికి వీల్లేదని జైపాల్‌రెడ్డి గాంధీభవన్‌లో విమర్శించడంపై స్పందించిన ఉండవల్లి శుక్రవారం రాజమహేంద్రవరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో పలు ప్రశ్నలను సంధించారు. పుస్తకంలో రాసిన తన ఊహ తప్పయితే నిజమేమిటో చెప్పాలని జైపాల్‌రెడ్డిని నిలదీశారు. ఇది తాను ఊహించి రాసిందేనని, కేవలం విశే్లషణ మాత్రమేనని సరిపెట్టుకుంటానని, అయితే అసలు విషయమేమిటో జైపాల్ రెడ్డి బయటపెట్టాలని కోరుతున్నానన్నారు. విభజన జరిగే సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య స్పీకర్ చాంబర్‌లో ఏమి జరిగిందో తాను ఊహించి రాశానన్నారు. లోపల జరిగింది కుట్ర, అనర్థం, రాజ్యాంగ విరుద్ధమని తాను ఊహించి రాసినప్పటికీ, నిజమేమిటో చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. జైపాల్‌రెడ్డి వెళ్ళి చెబితేనే తెలంగాణ వచ్చిందని, లేదంటే తెలంగాణ లేదని ఆయనే స్వయంగా ప్రకటించారని, కాబట్టి రాజ్యాంగంపై గౌరవం ఉంటే ఆ విషయం ఏమిటో బయటపెట్టాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. అపార అనుభవం కలిగిన జైపాల్‌రెడ్డికి ప్రజాస్వామ్యంపై గౌరవం వుంటే, పారదర్శకతకు అర్థం తెలిసివుంటే, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని, నిజమేమిటో ఒప్పుకోవాలని కోరారు. జైపాల్‌రెడ్డి స్థాయి వ్యక్తే సెంటిమెంట్‌కులోనై తప్పుడు సలహా ఇచ్చానని ఒప్పుకుంటే ఆయన వ్యక్తిత్వం మరింత పెరుగుతుందన్నారు. జైపాల్‌రెడ్డిది నిజాలను దాచేసే వ్యక్తిత్వం కాదని తాను విశ్వసిస్తున్నానని, తెలంగాణ ఇవ్వడం రాజ్యాంగబద్ధమో, రాజ్యాంగ విరుద్ధమో తేల్చాల్సి వుందన్నారు.