ఆంధ్రప్రదేశ్‌

మళ్లీ అదే ‘ముద్ర’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ‘ముద్రగడ.. ముద్రగడ..’ రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు పొరుగు రాష్ట్రాల్లోనూ మారుమోగుతున్న పేరు ఇది. రెండు రోజులుగా ఏపి ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన ముద్రగడ పద్మనాభం రెండు దశాబ్దాల కిందట రాష్ట్ర రాజకీయాలను శాసించి చెరగని ముద్రవేశారు. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ముద్రగడ ఒక్క పిలుపు ఇస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందన్న స్థాయిలో రాజకీయాలను నెరపిన నాయకుడు. క్రియాశీల రాజకీయాల నుంచి ముద్రగడ తెరమరుగయ్యారని భావిస్తున్న తరుణంలో కాపు గర్జన సందర్భంగా జరిగిన విధ్వంసంతో మరోసారి తెరపైకి వచ్చారు.
ఎవరీ ముద్రగడ?
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ముద్రగడ వీరరాఘవయ్య కుమారుడు ముద్రగడ పద్మనాభం. తొలిసారి 1978లో ముద్రగడ పద్మనాభం పిన్న వయసులోనే ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత టిడిపిలో చేరి 1983, 1985లో కూడా ఎమ్మెల్యేగా గెలుపొంది మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజుశాఖ, రవాణాశాఖ మంత్రిగా పని చేశారు. తాను నిర్వహిస్తున్న రవాణాశాఖలో తనకు తెలియకుండా కృష్ణా జిల్లాలో డొంక రూట్లను జాతీయం చేయడం పట్ల ఆగ్రహంతో 1988 మార్చి 28న మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత ‘తెలుగునాడు’ పార్టీని స్థాపించి అనంతరం 1989 ఎన్నికల ముందు దానిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, ఆ ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది మర్రిచెన్నారెడ్డి మంత్రివర్గంలో చేరారు. ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గాల్లో స్థానం లభించకపోవడంతో క్రియాశీల రాజకీయాలకు చాలా కాలం పాటు దూరంగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో అప్పటి సిఎం విజయభాస్కర్‌రెడ్డి బహిరంగ సభలో కాపులను బిసిలలో చేర్చాలన్న డిమాండ్ చేసిన ఆందోళనకారులపై లాఠీ చార్జీ జరిగింది. దీంతో అప్పటివరకు వౌనంగా ఉన్న ముద్రగడ అందివచ్చిన అవకాశాన్ని అస్త్రంగా మలచుకొని లాఠీచార్జీ జరిగిన చోటే కాపుల ఆత్మగౌరవం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించి ముఖ్యమంత్రి కోట్లపై నిప్పులు చెరిగారు. ఆ తర్వాత కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమాన్ని తీవ్రతరం చేసి అదే సంవత్సరం జూలై ఒకటిన భార్యతో సహా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కాపు ఉద్యమం రోజు రోజుకు తీవ్రతరంగా మారి కోస్తాంధ్ర భగ్గుమంది. దీంతో కోట్ల కాపులను బిసిలలో చేర్చాలని మంత్రివర్గంలో తీర్మానం చేయడంతో పాటు బిసిల్లో చేర్చడానికి అధ్యయనం చేయడానికి జస్టిస్ పుట్టుస్వామి కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కమిషన్ నివేదిక వచ్చే వరకు ఆగకుండా బిసిల వలెనేకాపు విద్యార్థులకు, యువకులకు ఆర్థిక సహాయం, రాయితీలను వర్తింప చేస్తూ జీవో 30ని జారీ చేశారు. తదనంతర రాజకీయ పరిణామాలతో కాపు ఉద్యమాన్ని ముద్రగడ పక్కన పెట్టారు. గత ఎన్నికల్లో కాపులను బిసీలలో చేర్చుతామని టిడిపి ఎన్నికల ప్రణాళికలో హామీ ఇవ్వడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.

ముద్రగడతో నిరాహార దీక్ష విరమింపచేసిన అప్పటి ఆర్థిక మంత్రి కె.రోశయ్యతో పాటు ప్రస్తుత ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి

కాపులను బిసిలలో చేర్చి
చిత్తశుద్ధి నిరూపించుకోండి

చంద్రబాబుకు చిరంజీవి హితవు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 1: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ఎంపి, మాజీ మంత్రి చిరంజీవి బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో జరిగిన కాపుగర్జన సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయన్నారు. 20 మాసాలుగా పారదర్శకత లేకుండా సాగుతున్న పరిపాలనే దీనికి కారణమన్నారు. హామీలను నిలబెట్టుకోకపోతే కాపులు, బిసిలు, మహిళలు అందరూ ఉద్యమిస్తారన్నారు. 2014 ఎన్నికల్లో కాపులకు ఆర్థిక, సామాజికపరమైన హామీలను అన్నింటిని ఖచ్చితంగా నెరవేర్చి చూపిస్తామని ప్రజలకు హామీలు ఇచ్చారన్నారు. వివిధ వర్గాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పరిపాలించాల్సిన మీరు విభజించు పా లించు పద్ధతిలో వివిధ వర్గాల మధ్య అపోహలు సృష్టించడం సమంజసం కాదని చంద్రబాబును ఉద్దేశించి చిరంజీవి పేర్కొన్నారు. కాపుల రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపే చొరవ చూపేవారన్నారు. కాపు కార్పొరేషన్‌కు రెండేళ్లలో రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే కేవలం 100 కోట్లు విదిలించారన్నారు. లోపాన్ని మీ వద్ద ఉంచుకుని ఇతర పార్టీల మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
ప్రతిపక్షాల నోళ్లు మూయించడానికి ఎదురుదాడి చేసే మీ ఎత్తుగడలను మానుకుని ఇప్పటికైనా అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి పారదర్శకతతో ఇచ్చి న హామీలను నెరవేర్చాలని చంద్రబాబుకు చిరంజీవి హితవు పలికారు.