ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలంలో 1 నుంచి శరన్నవరాత్రోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 27:ప్రముఖ శైవక్షేత్రం, శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 1 నుంచి 11 వరకు నిర్వహించే ఉత్సవాలకు దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు వాహన సేవలు, అమ్మవారి ఉత్సవమూర్తులకు నవదుర్గ అలంకారాలు, నవావర్ణ పూజలు, చండీయాగం, రుద్రయాగం ప్రతిరోజు గ్రామోత్సవం నిర్వహిస్తారు. 1వ తేదీ అమ్మవారికి శైలపుత్రి అలంకారం, స్వామి అమ్మవార్లకు రావణ వాహన సేవ, 2న అమ్మవారికి బ్రహ్మచారిణి అలంకారం, స్వామి అమ్మవార్లకు మయూర వాహన సేవ, 3న చంద్రఘంట అలంకారం, రావణ వాహనసేవ, 4న కూష్మాండదుర్గ అలంకారం, కైలాసవాహన సేవ, 5న స్కంధమాత అలంకారం, శేషవాహన సేవ, 6న కాత్యాయిని అలంకారం, పుష్పపల్లకీ సేవ, 7న కాళరాత్రి అలంకారం, గజవాహన సేవ, 8న మహాగౌరి అలంకారం, నందివాహన సేవ, 9న సిద్ధిదాయిని అలంకారం, హంసవాహన సేవ, 10న రాజరాజేశ్వరీ అలంకారం, అశ్వవాహన సేవ, 11న శ్రీభ్రమరాంబ దేవి నిజరూప అలంకరణ, నందివాహన సేవ నిర్వహిస్తారు. శరన్నవరాత్రోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి నారాయణ భరత్‌గుప్త తెలిపారు. భక్తుల రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.