ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, సెప్టెంబర్ 27: అక్టోబర్ 3నుంచి ప్రారంభం కానున్న తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల మందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. మంగళవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయంలోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును శే్వత వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు. శుద్ధి పూర్తయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరిపసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమాన్ని గోడలకు పూశారు. ఈ యావత్ కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది ఒక మహాయజ్ఞంలా నిర్వహించారు. ఈకార్యక్రమంలో టిటిడి ఇఓ, చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. తిరుమల శ్రీవారి ఆలయంలో శుద్ధి చేస్తున్న టిటిడి ఇఓ, చైర్మన్